ఢిల్లీకి పయనమైన సీఎం జగన్.. రేపు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు

AP CM Jagan Leaves For Delhi Today Will Attend The NITI Aayog Meeting Tomorrow,AP CM Jagan Leaves For Delhi Today,AP CM Jagan Will Attend The NITI Aayog Meeting,NITI Aayog Meeting Tomorrow,YS Jagan Heads To Delhi,Mango News,Mango News Telugu,YS Jagan To Delhi For NITI Aayog Meeting,Jagan To Attend Niti Aayog Meeting,Andhra Pradesh CM Jagan Mohan Reddy,AP CM YS Jagan Mohan Reddy,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates,NITI Aayog Meeting Latest News,NITI Aayog Meeting Latest Updates,NITI Aayog Meeting Live News

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఢిల్లీకి పయనమయ్యారు. మూడు రోజుల పాటు ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. పర్యటనలో భాగంగా ఆయన రేపు (శనివారం, మే 27, 2023) ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగనున్న నీతి ఆయోగ్ 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ఇటీవల విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ గురించి సీఎం జగన్ ప్రత్యేకంగా ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం జగన్ ప్రసంగానికి సంబంధించిన నోట్‌ను అధికారులు ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం. దీంతో పాటు గడిచిన నాలుగేళ్లలో ఏపీ సాధించిన ప్రగతిని, ముఖ్యంగా నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం జగన్ ప్రస్తావిస్తారని చర్చ జరుగుతోంది. అంతేకాదు శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు సమాచారం. అలాగే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, విభజన హామీల అమలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీంతో పాటు కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల నూతనంగా నిర్మించిన పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో కలిసి సీఎం జగన్‌ పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + eleven =