కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అయిన సీఎం జగన్, వచ్చే ఎన్నికలకు దిశానిర్దేశం

AP CM YS Jagan Interacts with Alur Constituency YSRCP Activists Today at Tadepalli, CM Jagan Met Workers Of Aluru Constituency, CM Jagan Directions For Upcoming Elections, AP CM YS Jagan Interacts with Alur Constituency, Mango News, Mango News Telugu, CM YS Jagan Meets Alur Constituency, YSRCP Activists, CM Jagan Meeting with Alur Constituency, AP CM Jagan Meeting Alur Constituency, AP CM Jagan Meeting Today Live, CM Jagan Live News, CM Program Today Live, AP CM YS Jagan Mohan Reddy Latest News And Updates

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు మరోవైపు పార్టీ కార్యక్రమాలకు కూడా సమయం కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో సీఎం జగన్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలకు ఇప్పటినుంచే సమాయత్తం కావాలని, నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పారు. ప్రతినెలా ఆరు గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించాలని, పార్టీ సంక్షేమం, ప్రభుత్వ అభివృద్ధి ఎజెండాను నెరవేర్చే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో కలిసి భాగస్వాములవ్వాలని కార్యకర్తలకు సూచించారు. దీనికోసం వారు క్రియాశీలక పాత్ర పోషించాలని, అదనపు బాధ్యతలను భుజానకెత్తుకోవాలని జగన్ అన్నారు. ఇక ప్రాధాన్యతా పనులు చేపట్టేందుకు ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలు ఇస్తున్నామని, ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గడప గడపకూ ద్వారా వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఈ మూడేళ్ళలో చేసిన మంచిని, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలని సీఎం జగన్ ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − three =