ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌ వెబ్‌సైట్ ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

AP CM YS Jagan, AP CM YS Jagan Launched Official AP Fact Check Website, AP CM YS Jagan Launched Official AP Fact Check Website Today, AP Fact Check website, AP govt launches a mechanism to check fake news, AP Govt Launches Fact Check Website, Mango News, YS Jagan, Ys Jagan Launched AP Fact Check Website, YS Jagan Launched Official AP Fact Check Website, YS Jagan launches AP Fact Check website, YS Jagan Mohan Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌ వెబ్‌సైట్ ను ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక ఫాక్ట్ చెక్ విభాగం https://factcheck.ap.gov.in వెబ్‌సైట్ మరియు ట్విట్టర్‌ అకౌంట్‌ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. రాష్ట్రంలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడాన్ని అరికట్టే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వెబ్‌సైట్ ను రూపొందించింది.

ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, ఇటీవల సోషల్ ‌మీడియాలో దురుద్దేశపూర్వక ప్రచారం జరుగుతుందని, అలా జరిగే తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌ వేదికగా ప్రభుత్వం ఖండిస్తుందని చెప్పారు. దుష్ప్రచారం ఏ విధంగా తప్పో సాక్ష్యాధారాలతో చూపించి, వాస్తవాలను ప్రజల ముందు ఉంచడమే ఫ్యాక్ట్‌ చెక్ వెబ్‌సైట్ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, అలాగే వ్యవస్థలు, ప్రజలను తప్పుదోవ పట్టించేలా కొందరు వేరే కారణాలతో దురుద్దేశపూర్వక ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి వాటికి ఎక్కడోచోట ముగింపు పలకాలని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − seventeen =