ప్రజాసంకల్పయాత్ర పై సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి రాసిన ‘ జయహో ‘ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఆగస్టు 12, సోమవారం నాడు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దిప్రింట్ ఎడిటర్ పద్మభూషణ్ శేఖర్ గుప్తాతో కలిసి సీఎం జగన్ ఆవిష్కరించారు. ఎమెస్కో సంస్థ రూపొందించిన ఈ జయహో పుస్తకంలో 14 నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా వై.ఎస్ జగన్ చేసిన పాదయాత్రలో ముఖ్య ఘట్టాలను పొందు పరిచారు. 3,600 కీ.మీ దూరం పాటు సుదీర్ఘంగా జరిగిన పాదయాత్రలోని అంశాలను ఈ పుస్తకంలో ఫొటోలతో సహా రూపొందించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, తనపై రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడ వమ్ము చేయనని చెప్పారు. ఈ సందర్భంగా పాదయాత్రలో తనకు ఎదురైనా అనుభవాలను గుర్తు చేసుకున్నారు. పాదయాత్ర లో ప్రజల కష్టాలు తెలుసుకొన్న తరువాత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, సుపరిపాలన అందిస్తామని చెప్పారు. తన పాదయాత్రపై పుస్తకాన్ని రూపొందించినందుకు ముఖ్యమంత్రి జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత కె.రామచంద్రమూర్తి, ఎమెస్కో సంస్థ అధినేత విజయ్ కుమార్, సీనియర్ పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.
Subscribe to our Youtube Channel Mango News for the latest News.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.