ఏపీలో అక్టోబర్ 15 న కాలేజీలు ప్రారంభం

AP CM YS Jagan, AP CM YS Jagan Says Colleges will Open, AP Colleges To Reopen, AP Colleges To Reopen From Oct 15, AP Colleges will Open On October 15 th, Colleges in Andhra Pradesh, Colleges to be opened in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆగస్టు 6, గురువారం నాడు రాష్ట్రంలో ఉన్నత విద్యా విధానంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో అక్టోబర్‌ 15 నుంచి కాలేజీలు ప్రారంభించాలని నిర్ణయించారు. అలాగే సెప్టెంబర్ లో ప్రవేశ పరీక్షల(సెట్‌ల) నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ఉన్నత విద్యపై సీఎం జగన్ తీసుకున్న పలు కీలక నిర్ణయాలు:

  1. మూడేళ్ల డిగ్రీ కోర్సులో 10 నెలల అప్రెంటిస్‌షిప్, ఇందుకు అదనంగా ఒక ఏడాది నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అంశాలపై శిక్షణ ఇచ్చి ఆనర్స్‌ డిగ్రీ‌గా పట్టా అందజేత
  2. వృత్తి విద్యా డిగ్రీ/కోర్సులలో కూడా 4 ఏళ్లలో 10 నెలలు తప్పనిసరి అప్రెంటిస్‌షిప్,‌ ఇందుకు అదనంగా 20 అడిషనల్‌ క్రెడిట్స్‌ సాధించిన వారికీ ఆనర్స్‌ డిగ్రీ అందజేత
  3. అడ్మిషన్ల సమయంలోనే సాధారణ డిగ్రీ కావాలా, ఆనర్స్‌ డిగ్రీ కావాలా అనే విషయంపై విద్యార్థులకు ఛాయిస్ ఇవ్వనున్నారు
  4. యూనివర్శిటీల్లో ఖాళీల భర్తీకి ఆమోదం, తర్వలోనే దాదాపు 1110 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ
  5. ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో యూనివర్శిటీలు ఏర్పాటుకు నిర్ణయం
  6. పాడేరులో ట్రైబల్‌ యూనివర్శిటీ ఏర్పాటుకు అంగీకారం
  7. కడపలో ఆర్కిటెక్చర్‌ యూనివర్శిటీకి చర్యలు
  8. కర్నూలులో క్లస్టర్‌ యూనివర్శిటీని ఏర్పాటు
  9. కురుపాంలో ట్రైబల్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ పనులు మొదలుపెట్టాలని ఆదేశాలు
  10. తెలుగు, సంస్కృతం అకాడమీల ప్రారంభానికి ఆమోదం
  11. కాలేజీలు ప్రారంభం అయిన వెంటనే విద్యాదీవెన, వసతి దీవెన అమలుకు అన్ని ఏర్పాట్లు చేయాలి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 8 =