మే 31న ‘అమరావతి టౌన్‌షిప్‌’ ప్లాట్లకు ఈ-వేలం వేయనున్న సీఆర్డీఏ, ఆన్‌లైన్‌ దరఖాస్తులకు మే 27 వరకు అవకాశం

AP E-Auction Process To be Held For 331 Plots of Amaravati Township on May 31, Andhra Pradesh Capital Region Development Authority will conduct e-auctions to sell 331 plots situated in the Amaravati Township, APCRDA will conduct e-auctions to sell 331 plots situated in the Amaravati Township, Andhra Pradesh Capital Region Development Authority will conduct e-auctions to sell 331 plots, e-auctions to sell 331 plots situated in the Amaravati Township, e-auctions to sell 331 plots, 331 plots, e-auctions, Amaravati Township, Andhra Pradesh Capital Region Development Authority, APCRDA, E-Auction Process To be Held For 331 Plots, E-Auction Process To be Held For 331 Plots of Amaravati Township on May 31, Amaravati Township News, Amaravati Township Latest News, Amaravati Township Latest Updates, Amaravati Township Live Updates, Mango News, Mango News Telugu,

గుంటూరు జిల్లా లోని నవులూరు, మంగళగిరి గ్రామాల్లోని ‘అమరావతి టౌన్‌షిప్‌’ లోని 200 నుంచి 1,000 చదరపు గజాల సైజులో ఉన్న 331 ప్లాట్లకు మే 31న ఈ-వేలం వేయడానికి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) నిర్ణయించింది. ఈ ప్లాట్లకు సంబంధించి ఈ-వేలం రిజిస్ట్రేషన్ శుక్రవారంతో ముగుస్తుందని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్‌డీఏ) కమిషనర్ వివేక్ యాదవ్ బుధవారం ప్రకటించారు. ఈ వివరాలను వివేక్‌ యాదవ్‌ బుధవారం మీడియా సమావేశంలో తెలిపారు. మొత్తం 285.17 ఎకరాల్లో 1,327 ప్లాట్లను అభివృద్ధి చేయగా దాదాపు 931 ప్లాట్లను సీఆర్డీఏ గతంలోనే విక్రయించిందని వెల్లడించారు.

తాజాగా మరో 331 ప్లాట్లను వివిధ లాట్‌లుగా విభజించి, ఇందులో 29 ప్లాట్లను ముందుగా వేలం వేసేందుకు సీఆర్డీఏ సిద్ధమైంది. 200 చదరపు గజాల చొప్పున 23 ప్లాట్లు, 1,000 చదరపు గజాల చొప్పున ఉన్న ఆరు ప్లాట్లకు ఆన్‌లైన్‌లో వేలం నిర్వహిస్తామని చెప్పారు. చదరపు గజానికి రూ.17,800గా ధర రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఆసక్తి గలవారు ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 31వ తేదీ ఉదయం నుంచి ఆన్‌లైన్‌లో వేలం నిర్వహిస్తామని వెల్లడించారు. ఇతర వివరాలకు https:// konugolu. ap. gov. in వెబ్‌సైట్‌ను సందర్శించాలని, అలాగే 0866–246370/71/72/73/74 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =