టీటీడీ బోర్డు సభ్యుడిగా నిర్మాత, పారిశ్రామికవేత్త దాసరి కిరణ్‌కుమార్‌ నియామకం

AP Govt Appointed Producer Dasari Kiran Kumar as a Member for Tirumala Tirupati Devasthanam Board,AP Govt,Tirumala Tirupati Devasthanam Board,TTD Board,Mango News,Mango News Telugu,Producer Dasari Kiran Kumar,Tirumala Tirupati Devasthanam,TTD Board Latest News and Updates,Dasari Kiran Kumar Producer,Dasari Kiran Kumar News and Live Updates,Andhra Pradesh TTD,TTD Andhra Pradesh,Andhra Pradesh News and Updates

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యునిగా నిర్మాత, పారిశ్రామికవేత్త దాసరి కిరణ్‌ కుమార్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం టీటీడీ బోర్డులో వివిధ రాష్ట్రాలు, రంగాలకు చెందిన వ్యక్తులు సభ్యులుగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా పలు సినిమాలు నిర్మించిన దాసరి కిరణ్‌ కుమార్‌ ను టీటీడీ సభ్యుడిగా నియమించడంతో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కూడా టీటీడీ బోర్డుకు ప్రాతినిధ్యం ఉన్నట్లయింది.

తనకు టీటీడీ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దాసరి కిరణ్‌ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి, మచిలీపట్టణం ఎంపీ బాలశౌరికి దాసరి కిరణ్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా టీటీడీ బోర్డు సభ్యుల నియామకంపై ప్రస్తుతం ఏపీ హైకోర్టులో పెండింగ్ లో ఉన్న రిట్ పిటిషన్ ఫలితానికి లోబడి ఈ నియామకం జరిగినట్లుగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =