అమరావతి ప్రాంత రైతులు: వార్షిక కౌలు రూ.158 కోట్లు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

Amaravati Farmers, Andhra Pradesh, andhra pradesh capital amaravathi, Annual Lease Amount to Amaravati Farmers, Annual Lease Amount to Capital Amaravati Farmers, Annual Lease To Farmers, AP Govt Releases Rs 158 Crore Annual Lease Amount, Capital Amaravati Farmers

అమరావతి నిర్మాణానికి భూసేకరణలో భాగంగా భూములు ఇచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపుకు సంబంధించి ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులకు వార్షిక కౌలు మరియు రెండు నెలల పెన్షన్‌ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. వార్షిక కౌలు కింద రూ.158 కోట్లు, అలాగే రెండు నెలల పెన్షన్‌ 9.73 కోట్లను సంబంధిత రైతుల అకౌంట్లలో జమ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగస్టు 27, గురువారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

మరోవైపు మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, సాంకేతిక సమస్యల వల్లే రైతులకు వార్షిక కౌలు చెల్లింపులో ఆలస్యం జరిగిందని అన్నారు. ఈ విషయంపై ప్రజలను రెచ్చగొట్టి, ప్రతిపక్షాలు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. అలాగే భూహక్కు పత్రాలను అమ్ముకున్న రైతులకి కౌలు చెల్లింపులు ఉండవని మంత్రి బొత్స పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 3 =