ఉద్దానం బాధితులకు రూ. 10వేలు పెన్షన్, ప్రత్యేకంగా ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నాం – మంత్రి విడదల రజిని

AP Health Minister Vidadala Rajini Explains The Action Taken by Govt For Uddanam Patients, AP Health Minister Vidadala Rajini, AP Govt Uddanam Patients, Uddanam Kidney Issues, Mango News, Mango News Telugu, Uddanam Kidney Disease, Uddanam Kidney Disease Causes, Uddanam Village, Uddanam Village Srikakulam, Uddanam Kidney Disease Pension, AP Govt Pension to Uddanam Kidney Diseases, YSR Congress Party, Janasena Party, Uddanam Latest News And Updates

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యాన్ని అభివృద్ధికి ముఖ్యమైన సూచికగా తీసుకుంది. అట్టడుగు స్థాయిలో క్రమబద్ధమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజిని. బుధవారం ఆమె సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉద్దానం బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ చర్యల గురించి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందని, ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని పేర్కొన్నారు. అలాగే నాడు-నేడు కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా అనేక ఆస్పత్రులలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

ఉద్దానం సమస్యపై కూడా ప్రభుత్వం చితశుద్ధితో ఉందని, కానీ ప్రతిపక్షాలు, విపక్ష మీడియా ఉద్దానం సమస్యలపై అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని మంత్రి రజిని మండిపడ్డారు. సీఎం జగన్ ఉద్దానం సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టారని, ఆయన ఆదేశాల మేరకు బాధితులకు రూ. 10వేలు పెన్షన్ అందజేస్తున్నామని తెలిపారు. అలాగే అక్కడి రోగులకు నిత్యం డయాలసిస్ నిర్వహిస్తున్నామని, అంతేకాకుండా ఉద్దానంలోని కిడ్నీ బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించడానికి ప్రత్యేకంగా ఆస్పత్రిని నిర్మిస్తున్నామని వివరించారు. ఇక రాష్ట్రంలో తొలిసారిగా, ద్వైపాక్షిక కోక్లియర్ ఇంప్లాంటేషన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి విధానాలకు ప్రభుత్వం మద్దతు ఇస్తోందని, గత మూడేళ్లలో 473 మంది రోగులు దీనిద్వారా ప్రయోజనం పొందారని మంత్రి విడదల రజిని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 11 =