ఏపీలో గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహణ

APPSC, APPSC Announces GROUP-I Mains Exam, APPSC Group 1 Exam Date, APPSC Group 1 Exam Date 2020, APPSC Group 1 mains exam, APPSC Group I Mains exam to be conducted from November 2, APPSC Mains Exams, APPSC Released Group 1 Mains Exams, APPSC Released Group 1 Mains Exams Schedule

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 2 నుంచి నవంబర్ 13 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అక్టోబ‌రు 19 నుంచి అధికారిక వెబ్‌సైట్‌ (https://psc.ap.gov.in/) లో హాల్‌టికెట్లను ‌డౌన్ లోడ్ చేసుకోవచ్చని ప్రకటించారు. ఏపీలో 13 జిల్లాలతో పాటుగా హైదరాబాద్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు చేస్తునట్టు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు మెయిన్స్ పరీక్ష జరుగుతుందని తెలిపారు. ప్రశ్నపత్రం ఇంగ్లీష్/తెలుగు వెర్షన్ లలో టాబ్ ద్వారా అందించబడుతుందని చెప్పారు. కరోనా నేపథ్యంలో అభ్యర్థులు అంతా తమ మాస్కులు, గ్లోవ్స్, పర్సనల్ హ్యాండ్ శానిటైజర్ మరియు ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here