టీడీపీకి బీద మస్తాన్‌రావు రాజీనామా

Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Beeda Mastan Rao, Beeda Mastan Rao Resigns To TDP, Mango News Telugu, TDP latest news, TDP Leader Beeda Mastan Rao

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీకి నాయకుల రాజీనామాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవలే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్, ఆదినారాయణ రెడ్డి, సాదినేని యామిని శర్మతో పాటుగా పలువురు నాయకులు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నెల్లూరు జిల్లాలో టీడీపీ పార్టీకి మరో షాక్ తగిలింది. టీడీపీ సీనియర్‌ నాయకుడు బీద మస్తాన్‌రావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. డిసెంబర్ 6, శుక్రవారం నాడు బీద మస్తాన్‌రావు తన రాజీనామా లేఖను టీడీపీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పంపినట్లుగా తెలుస్తుంది. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు, వ్యక్తిగత కారణాలతోనే పార్టీని వీడుతున్నట్లు రాజీనామా లేఖలో మస్తాన్‌రావు పేర్కొన్నట్టు సమాచారం. మరో వైపు గత కొన్నిరోజులుగా మస్తాన్‌రావు వైసీపీలోకి వెళతారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మస్తాన్‌రావు టీడీపీకి రాజీనామా చేశాడని, త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరబోతున్నట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 16 =