పొలిటికల్‌ బరిలో కనిపించని ఆర్‌ఆర్‌ఆర్‌ పేరు

Raghurama Krishnaraj Got No More Ticket?, Raghurama Krishnaraj, Narsapuram MP Raghurama, Raghurama Quit Politics, Raghurama Dumped By TDP BJP, Narsapuram MP, Narsapuram, Narsapuram Political News, Raghurama Political News, Andhra Pradesh Elections, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
narsapuram mp raghurama likely to quit politics as he dumped by tdp bjp telugu news

2019లో నర్సాపురం నుంచి ఎంపీగా గెలిచిన కనుమూరు రఘురామ కృష్ణం రాజు ఈ సారి కనీసం పోటిలో నిలిచే అవకాశాలు కూడా లేవు. ఏ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న చంద్రబాబు సైతం ఈ ట్రిపుల్‌ ఆర్‌కు మొండిచెయ్యి చూపించినట్టుగా అర్థమవుతోంది. నర్సాపురం నుంచే ఎంపీ అభ్యర్థిగా రఘురామ పోటి చేస్తారని ముందుగా అంతా భావించారు. గతంలో వైసీపీ నుంచి గెలిచిన రఘురామ ఈ సారి బీజేపీ లేదా టీడీపీ నుంచి బరిలోకి దిగుతారన్న ప్రచారం జరిగింది. అందుకు బలమైన కారణాలున్నాయి.2019లో వైసీపీ టికెట్ పై గెలిచిన రఘురామ తక్కువ సమయంలోనే వైసీపీకి రెబల్‌గా మారారు. రోజూ ప్రెస్‌మీట్లు పెట్టి మరీ ఢిల్లీ నుంచి జగన్‌పై విమర్శల దాడి చేసేవారు. ఇది చంద్రబాబు వర్గానికి ఎంతో కలిసోచ్చిందని విశ్లేషకులు చెబుతుంటారు. అందుకే ఈ సారి చంద్రబాబు మద్దతుతో మళ్లీ నర్సాపురం నుంచి రఘురామ పోటి చేస్తారని అంతా అనుకోగా.. అసలు ఆయనకు ఇతర నియోజకవర్గాల టికెట్‌ కూడా దక్కలేదు.

ఒక్కరు కూడా ఛాన్స్ ఇవ్వలేదు:

బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా నర్సాపురం ఎంపీ స్థానాన్ని బీజేపీకి ఫిక్స్‌ చేశారు. దీంతో రఘురామకు బీజేపీ నుంచి టికెట్ వస్తుందనుకున్నారు. అయితే ఆయన అప్పటికీ కూడా వైసీపీకి రాజీనామా చేయలేదు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వం కూడా తీసుకోలేదు. జాతీయ పార్టీల లెక్కలు వేరు ఉంటాయి. ఇలా సభ్యత్వం కూడా లేని వారికి ఆ పార్టీ టికెట్ ఇవ్వదు. దీంతో క్షత్రియులు ఎక్కువగా ఉన్న విజయనగరం నుంచి రఘురామ టికెట్ ఆశించారు. చివరకు అక్కడ కూడా ఆయనకు ఛాన్స్ ఇవ్వలేదు కూటమి.

రఘురామ ఏమంటున్నారు?

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై ఒంటిచేత్తో పోరాడానంటున్నారు రఘురామ. తన ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధం చేస్తున్నప్పుడు ఎవరూ తనకు సహాయం చేయలేదని వాపోయారు. ఇటీవలి కాలంలో టీడీపీ, బీజేపీల్లో చేరి వచ్చే ఎన్నకల్లో పార్టీ టిక్కెట్లు పొందిన నేతలు ఎవరూ కూడా జగన్‌పై ఒక్క మాట కూడా అనలేదని, అధికార పార్టీలో బాధలు కూడా అనుభవించలేదన్నారు ఆర్‌ఆర్‌ఆర్‌. అయితే ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన ముగ్గురిలో ఏ ఒక్కరు కూడా తన త్యాగాన్ని గుర్తించలేదని, పలువురు నేతలు మద్దతిస్తున్నప్పటికీ తనకు పార్టీ టికెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాటలు వింటుంటే రేపో, మాపో రాజకీయ సన్యాసం తీసుకుంటారన్న చర్చ జోరుగా సాగుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =