వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కింద.. 12,132 మందికి రూ.87.32 కోట్లు పంపిణీ చేసిన సీఎం జగన్

CM Jagan Released Rs 87.32 Cr Funds For 12132 Beneficiaries Under YSR Kalyanamasthu and Shaadi Tofa Schemes,YSR Kalyanamasthu and Shaadi Tofa Schemes,CM Jagan To Release YSR Kalyanamasthu,CM Jagan To Release Shaadi Tofa Schemes,Mango News,Mango News Telugu,YSR Kalyanamasthu YSR Shaadi Tofa Funds Release,CM Jagan Released Rs 87.32 Cr Funds For 12132 Beneficiaries,YSR Kalyanamasthu Latest News And Updates,YSR Shaadi Tofa Latest News And Updates,CM Jagan Latest News And Updates,YSR Kalyanamasthu,YSR Shaadi Tofa

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనవరి-మార్చి 2023లో పెళ్లి చేసుకున్న 12,132 మంది పేదకుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు ‘వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు’ మరియు ‘వైఎస్‌ఆర్ షాదీ తోఫా’ పథకాల కింద రూ.87.32 కోట్ల ఆర్థిక సహాయాన్ని విడుదల చేశారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన బటన్ నొక్కి నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ఈ పథకాలను ప్రవేశపెట్టామని, లంచాలు, వివక్షకు తావులేకుండా రాష్ట్రవ్యాప్తంగా వీటిని అమలుచేస్తున్నామని పేర్కొన్నారు. ఇక ఈ పథకాల కింద అందించే ఆర్థిక సహాయం ఇంతకుముందు వధువు ఖాతాలో జమ చేసేవారమని, అయితే కొంత మంది అభ్యర్థనల మేరకు ఇకపై వధువు తల్లుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఇంకా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఒకవేళ వివాహిత తల్లి మరణించిన సందర్భంలో.. వివాహిత కుమార్తె నిర్ణయాన్ని బట్టి ఈ ఆర్థిక సహాయం ఆమె తండ్రి, అన్నదమ్ములు లేదా సంరక్షకుల ఖాతాల్లో జమ చేయబడుతుందని వెల్లడించారు. అయితే కులాంతర వివాహాలకు మాత్రం వధువు ఖాతాలో ఆర్థిక సాయం జమ అవుతుందని తెలిపారు. కాగా గతేడాది అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య కాలంలో ఈ పథకాలకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి ఇప్పటికే ఆర్థిక సాయం చేశామని గుర్తుచేశారు. గతంలో వలే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోనే స్వచ్ఛందంగా ఎంతో పారదర్శకంగా అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.

కాగా ఏపీలోని పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లలను చదివించడం మరియు తరువాత గౌరవప్రదమైన రీతిలో వివాహం చేయడంలో తల్లిదండ్రులకు సహాయపడటానికై వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ‘వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు’ మరియు ‘వైఎస్‌ఆర్ షాదీ తోఫా’ పథకాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా వైఎస్ఆర్ కళ్యాణమస్తు కింద.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, వికలాంగులు, భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకు చెందిన బాలికలకు, అలాగే ముస్లిం మైనార్టీ వర్గాలకు చెందిన బాలికలకు వైఎస్ఆర్ షాదీ తోఫా కింద ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. కాగా కళ్యాణ లక్ష్మి, షాదీ తోఫా పథకాల కింద ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష, కులాంతర వివాహాలకు రూ.1.20 లక్షలు, మైనారిటీలకు రూ.లక్ష, బీసీలకు రూ.50 వేలు చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. అలాగే దివ్యాంగులకు రూ.1.50 లక్షలు, భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకు రూ.40 వేల వంతున ఆర్థిక సాయం ఇస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − one =