ఒలంపిక్స్ లో పాల్గొనే ఏపీ క్రీడాకారులకు సీఎం జగన్ శుభాకాంక్షలు, ఒక్కొక్కరికి 5 లక్షల చెక్‌ అందజేత

AP CM hands over land allocation documents to P V Sindhu, CM YS Jagan Conveyed Wishes to AP Players PV Sindhu, CM YS Jagan Wishes AP Players, CMO Andhra Pradesh, Mango News, Olympics 2021, Rajani Who will Participate in Tokyo Olympics, Satwik SaiRaj, Tokyo 2020 Olympics, Tokyo 2020 Olympics Schedule for 2021, Tokyo 2020 Summer Olympics, Tokyo Olympic Games, Tokyo Olympic Games 2021, Tokyo Olympics, Tokyo Olympics 2020, tokyo olympics 2021, Tokyo Olympics 2021 India

జపాన్‌ లోని టోక్యో నగరంలో జూలై 23, 2021 నుంచి ఆగస్టు 8, 2021 వరకు ఒలింపిక్స్‌ క్రీడలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి దేశం తరపున ఒలంపిక్స్ లో పాల్గొంటున్న బ్యాడ్మింటన్ ప్లేయర్స్ పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు), ఆర్‌.సాత్విక్‌ సాయిరాజ్ కు మరియు హాకీ క్రీడాకారిణి రజనీలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం నాడు పీవీ సింధు, ఆర్‌.సాత్విక్‌ సాయిరాజ్ సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. అలాగే రజనీ ప్రస్తుతం బెంగళూరులో శిక్షణలో ఉండడంతో ఆమె కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ పీవీ సింధు, ఆర్‌ సాత్విక్‌ సాయిరాజ్, రజనీలకు శుభాకాంక్షలు తెలిపి, ఒక్కొక్కరికి రూ.5 లక్షల చెక్‌ ను అందజేశారు.

మరోవైపు పీవీ సింధుకు అకాడ‌మీ, స్పోర్ట్స్ స్కూలు ఏర్పాటు కోసం విశాఖ రూర‌ల్ చినగ‌డిలి గ్రామంలో రెండు ఎక‌రాలు భూమిని కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు ఎకరాల భూమి కేటాయింపుకు సంబంధించిన జీవోను ఈ సందర్భంగా సీఎం జగన్‌ పీవీ సింధుకి అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 9 =