ఏపీలో రహదారులపై సమీక్ష చేపట్టిన సీఎం వైఎస్‌ జగన్‌.. పలు కీలక నిర్ణయాలు

CM YS Jagan Takes Key Decisions in a Review Meet on The Roads and Buildings Department, AP CM YS Jagan Takes Key Decisions in a Review Meet on The Roads and Buildings Department, Key Decisions in a Review Meet on The Roads and Buildings Department, Roads and Buildings Department, YS Jagan Takes Key Decisions in a Review Meet on The Roads and Buildings Department, AP CM Takes Key Decisions in a Review Meet on The Roads and Buildings Department, Review Meet on The Roads and Buildings Department, AP CM YS Jagan Review Meet on The Roads and Buildings Department, AP CM YS Jagan Held Review Meeting on The Roads and Buildings Department Review Meeting on The Roads and Buildings Department, AP CM YS Jagan Mohan Reddy Review Meeting on The Roads and Buildings Department, Buildings Department, Roads Department, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, AP CM Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, AP CM, YS Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈరోజు సీఎం క్యాంపు కార్యాలయంలో రహదారుల శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు, ఆర్‌ అండ్‌ బి మంత్రి దాడిశెట్టి రాజా, ఇతర ఉన్నతాధికారులు పలువురు హాజరయ్యారు. సమీక్ష సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడాదిలోగా ఎక్కడా గుంతల్లేని విధంగా రోడ్లను బాగు చేయాలని, వర్షాలు వలన దెబ్బతిన్న రోడ్లను తక్షణమే మరమ్మత్తులు చేయాలనీ ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన పెండింగ్‌ బ్రిడ్జిలు, ఆర్వోబీలు పూర్తిచేయాలని, నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం నాణ్యత కచ్చితంగా పాటించాలని సూచించారు. ఇంకా సమీక్షలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలలో ముఖ్యమైనవి..

– రూ. 2,661 కోట్ల నిధులతో కొత్తగా నిర్మించనున్న 38 ఆర్వోబీలు
– రూ. 1072.92 కోట్లతో పంచాయతీరాజ్‌ రోడ్ల నిర్మాణం
– రూ. 308 కోట్ల ఖర్చుతో 444 కి.మీ బీటీ అప్రోచ్‌ రోడ్ల నిర్మాణం
– రూ. 2,500 కోట్ల ఖర్చుతో 7,800 కి.మీ. పైగా ఆర్‌ అండ్‌ బీ రోడ్లుకు వర్షాకాలంలోగా మరమ్మత్తులు పూర్తి చేయాలి.
– రాయలసీమ జిల్లాలలో నివర్‌ తుఫాను వలన దెబ్బతిన్న బ్రిడ్జిల నిర్మాణాలకు దాదాపు రూ. 915 కోట్లు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్
– ఆగస్టు నాటికి ఫేజ్‌-1 పనులు పూర్తిచేసేలా.. రూ. 2,479 కోట్లతో నిడా-1 కింద 233 రోడ్లు, బ్రిడ్జిల పనులు మరియు నిడా-2 కింద రూ. 816.51 కోట్లు ఖర్చుతో 33 ఆర్వోబీ పనులకు ప్రణాళికలు
– ఎన్డీబీలో ఫేజ్‌-1 కింద రూ. 3,014 కోట్ల ఖర్చుతో 1,244 కి.మీ.ల రోడ్లు, అలాగే ఫేజ్‌-2 కింద రూ.3,386 కోట్ల ఖర్చుతో 1,268 కి.మీ.ల రోడ్లు నిర్మాణం
– జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా రూ. 30 వేల కోట్ల ఖర్చుతో 3079.94 కి.మీ. మేర అన్ని నేషనల్‌ హైవేలను కనీసం 10 మీ. వెడల్పుతో అభివృద్ధి చేయడం
– రాష్ట్రాల అనుసంధానం కోసం బెంగుళూరు-చెన్నై, చిత్తూరు-చెన్నై, రాయ్‌పూర్‌-విశాఖపట్నం, షోలాపూర్‌-కర్నూల్, హైదరాబాద్‌-విశాఖపట్నం, నాగ్‌పూర్‌–విజయవాడ రహదారుల అభివృద్ధి కోసం మొత్తం రూ. 15,875 కోట్ల ఖర్చుతో 2,157 కి.మీ రోడ్ల అనుసంధానం

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =