ఎన్టీఆర్, వైఎస్ఆర్‌లపై బీజేపీ ఎంపీ జీవీఎల్ వ్యాఖ్యలు.. స్పందించిన మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి

Former Union Minister Daggubati Purandeshwari Responds Over BJP MP GVL Comments on NTR and YSR,Former Union Minister,Daggubati Purandeshwari,Responds Over BJP MP GVL Comments,BJP MP GVL Comments,Comments on NTR and YSR,NTR,YSR,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్ బీజేపీలో మరో వివాదం నెలకొంది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గురువారం పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై సంచలన ఆరోపణలు చేస్తూ రాజీనామా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒకరోజు వ్యవధిలోనే ఆ పార్టీలో ఇంకో వివాదం రేగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పథకాలకు ఎన్టీఆర్, వైఎస్ఆర్ పేర్లే పెడుతున్నారని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. గుంటూరులో కాపు సామాజిక వర్గం నేతలు గురువారం బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావుకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాలకు ఎన్టీఆర్, వైఎస్ఆర్ పేర్లు పెట్టడాన్ని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉంటే ఎన్టీఆర్ పేరుతో పథకాలు ప్రకటిస్తుందని, వైసీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ పేరు పెడుతోందని ఎంపీ జీవీఎల్ వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో ఎంపీ జీవీఎల్ నరసింహరావు వ్యాఖ్యలపై మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఆమె ఆయన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎన్టీఆర్ తెలుగు జాతికి గుర్తింపు తెచ్చారని, రూ. 2 కిలో బియ్యం, పక్కా గృహలు ,జనతా వస్త్రాలు, మహిళా విశ్వవిద్యాలయం వంటివి తీసుకు వచ్చారని తెలిపారు. అలాగే వైఎస్ఆర్, ఫీజు రీ ఎంబర్స్‌మెంట్, 108 అంబులెన్స్ సేవలు, ఆరోగ్య శ్రీ వంటివి అందించారు’ అని పేర్కొన్నారు. దీనితోపాటు ఎంపీ జీవీఎల్ నిన్న మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌ని కూడా పురంధేశ్వరి షేర్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 3 =