సెంటిమెంట్‌ వర్కౌట్ అయ్యేనా?

Jagan's Bus Sentiment Will Work Out?, Jagan Sentiment Will Work, Sentiment Will Work Out, Bus Sentiment, AP Elections 2024, YCP Memu Siddham, Jagan Bus Yatra To Commence From March 27 Proddutoor, Telugu News, Jagan Yatra From Proddutoor, Proddutoor, CM Jagan, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
ap elections 2024, ycp memu siddham, jagan bus yatra to commence from march 27. proddutoor, telugu news

ఈసారి ఏపీ ఎన్నికలు గతంతో పోల్చితే లేట్‌గా జరగనున్నాయి. మండుటెండలో మే 13న ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఎన్నికల షెడ్యూల్‌కు పోలింగ్‌ డేట్‌కు దాదాపు రెండు నెలలు గ్యాప్‌ వచ్చింది. ఇది ఎవరూ ఊహించలేదు. ముఖ్యంగా ‘సిద్ధం’ సభలతో ఓ ఊపు ఊపిన వైసీపీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల తర్వాత రూటు మార్చింది. ఈ సారి బస్సు యాత్రతో దూసుకొస్తోంది. ఈ నెల(మార్చి 27) నుంచి జగన్‌ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ‘సిద్ధం’ సభలు కవర్‌ చేసిన ప్రాంతాలు మినాహాయించి మిగిలిన ప్రాంతాల్లో ఈ యాత్ర జరిగేలా వైసీపీ ప్లాన్ చేసింది. నాడు ‘సిద్ధం’ అనే పేరుతో సభలు నిర్వహించగా.. ఈసారి ‘మేము సిద్ధం’ అనే పేరుతో ప్రజల మధ్యకు వెళ్లనున్నారు జగన్. మార్చి 27న ఇడుపులపాయలో తన తండ్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్మారక చిహ్నం వద్ద ప్రార్థనలు చేసిన తర్వాత ఈ యాత్రను జగన్‌ ప్రారంభిస్తారు.

తొలిరోజు యాత్ర పులివెందుల, కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ప్రొద్దుటూరు పట్టణానికి చేరుకుంటుంది. మొదటి రోజు ప్రొద్దుటూరు పట్టణంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. మార్చి 28న నంద్యాల, మార్చి 29న కర్నూలు, మార్చి 30న హిందూపురం వరకు యాత్ర సాగుతుంది. ముఖ్యమంత్రి ప్రతిరోజూ సాయంత్రం ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తారు. నియోజకవర్గాల వారీగా ఎంపికైన అభ్యర్థులతో జగన్‌ సమావేశమవుతుతారు. ఈ విధంగా ఓటర్లతో పాటు పార్టీ శ్రేణులకు కూడా చేరువ కావాలని జగన్‌ భావిస్తున్నారు. కుల సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులతోనూ జగన్‌ భేటీ అవుతారని తెలుస్తోంది. ఈ మీటింగ్‌లు ఆయే సామాజికవర్గాల్లో తమ ఓటు బ్యాంకును పెంచుకునేందుకు పనికి వస్తుందని వైసీపీ ఆలోచిస్తోంది. ఎంతైనా ఏపీలో కులాలను రాజకీయాలను, పడే ఓట్లను వేరి చేసి చూడలేం.. మాట్లాడలేం!

మే 13న రాష్ట్ర ప్రజలు ఓటింగ్‌కు వెళ్లే సమయానికి ఏపీ మొత్తం కవర్ చేసేలా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో కనీసం ఒక సమావేశాన్ని నిర్వహించాలని జగన్‌ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే జరిగిన ఐదు సిద్ధం సభలకు లక్షల్లో జనసమీకరణ చేయడంలో వైసీపీ నేతలు సక్సెస్ అయ్యారు. ఇటు బస్సు యాత్రను విజయవంతం చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. జగన్‌ ఎక్కడకు వెళ్లినా భారీగా జనం వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు జగన్‌ తన సెంటిమెంట్‌ను మరోసారి నమ్ముకున్నారు. జగన్‌ ఏ కార్యక్రమం తలపెట్టినా ఇడుపులపాయలోని తన తండ్రి పార్థివ దేహానికి నివాళులర్పించే ముందుకుసాగుతారు. 2019లోనూ ఇదే చేశారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి అభ్యర్థులను ప్రకటించిన జగన్ 2019 ఎన్నికల్లో ఎవరూ ఊహించనంత భారీ విజయాన్ని నమోదు చేశారు. జగన్‌ గెలుపు ఖాయమని అప్పుడు ముందే తెలిసినా అది ఇంత మెజారిటీ వస్తుందని వైసీపీ నేతలు కూడా ఊహించలేదు. 175 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 151 స్థానాలు గెలిచిన వైసీపీ.. అటు 25 ఎంపీ స్థానాల్లో ఏకంగా 22 సీట్లను గెలుచుకోని ఔరా అనిపించింది. నాడు వైఎస్ఆర్ ఘాట్ వద్దే అభ్యర్థులను ప్రకటించిన జగన్‌ ఈసారి కూడా అదే చేశారు. మరి జగన్‌ సెంటిమెంట్‌ వర్కౌట్ అవుతుందా లేదా అంటే జూన్‌ 4వరకు ఆగాల్సిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =