పిఠాపురంలో కాపు వర్సెస్ కాపు..

Kapu vs Kapu in Pithapuram.., Kapu vs Kapu, Kapu in Pithapuram, Pithapuram Political News, Andhra, Pithapuram Politics, Suspense Thriller, Vanga Geeta Vs Pawan, Pawan Kalyan Versus Svsn Varma, Telugu News, CM Jagan, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
andhra ,pithapuram politics, suspense thriller, vanga geeta vs pawan, pawan kalyan versus svsn varma, telugu news

అనుభవంపై అభిమానం పైచేయి సాధిస్తుందా? ఏపీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అందరిచూపు పిఠాపురం నియోజకవర్గంపైనే ఉంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడ నుంచి పోటి చేస్తుండడమే దీనికి ప్రధాన కారణం. గత(2019) ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటి చేసిన పవన్‌ రెండు చోట్లా ఓడిపోయారు. దీంతో ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని బలంగా డిసైడ్ అయిన జనసేనాని తన గెలుపుకు అవకాశమున్న అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వేలు చేయించుకున్నారు. చివరకు పిఠాపురం నుంచే పోటి చేయాలని నిర్ణయించుకున్నారు. అటు పవన్‌కు చెక్‌ పెట్టేందుకు వైసీపీ భారీ ప్లానే వేసింది. రాజకీయాల్లో ఎంతో అనుభవమున్న వంగా గీతను పిఠాపురం నుంచి బరిలోకి దింపింది. దీంతో పిఠాపురంలో టగ్‌ ఆఫ్‌ వార్‌ ఖాయంగా కనిపిస్తోంది.

2 లక్షల 30 వేల పైచిలుకు ఓటర్లు ఉన్న పిఠాపురంలో కాపుల ఓట్ల సంఖ్య 90వేల పైమాటే. అందుకే పవన్‌ ఇక్కడ నుంచి పోటి చేయాలని నిర్ణయించుకున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నారు. కాపులంతా తనవైపే ఉన్నారని పవన్‌ బలంగా విశ్వసిస్తున్నారట. అయితే తాను కూడా కాపు ఆడబడుచునేనంటున్నారు వంగా గీతా. కాపులంతా తనతోనే ఉన్నారంటున్నారు. ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతాకు పిఠాపురంపై మంచి పట్టుంది. 2009లో ప్రజారాజ్యం తరుఫున పిఠాపురం నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు గీతా. ఇక ప్రజలకు నిత్యం టచ్‌లో ఉండే నాయకురాలుగా వంగా గీతాకు పిఠాపురం నియోజవర్గంలో మంచి పేరే ఉంది. అందుకే వైసీపీ కూడా ఇక్కడ గెలుపు ధీమాను వ్యక్తం చేస్తోంది.

కాపు కంచుకోటలో వైసీపీ జెండా ఎగరాలని పట్టుదలగా ఉన్న గీతాకు ఎలాగైనా చెక్‌ పెట్టేందుకు పవన్‌ పావులు కదుపుతున్నారు. ప్రత్యర్థులపై తరుచుగా విమర్శలు గుప్పించే పవన్‌ గీత విషయంలో మాత్రం స్ట్రాటజీని మార్చారు. గీతాను జనసేనలోకి రావాల్సిందిగా పవన్‌ ఆహ్వానించడం ఇందులో భాగమే. అయితే అటు వంగా గీతా పవన్‌ ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. తాను కూడా ‘కాపే‘నని ప్రచారం చేస్తున్నారు. కాపులంతా తనతోనే ఉన్నారని.. ఓట్లన్ని తనకే పడతాయంటున్నారు. మరోవైపు పవన్‌ను మరో టెన్షన్‌ పట్టుకుంది. ఎన్నో ఏళ్లుగా పిఠాపురం టీడీపీకి సేవలందిస్తున్న SVSNవర్మ పవన్‌కు సీటు కేటాయించడంపై అలకబూనారు. పిఠాపురం నుంచి పవన్‌ తన అభ్యర్థతత్వాన్ని ప్రకటించకున్న మరుక్షణం నుంచే వర్మ అనుచరులు నిరసనలకు దిగారు. ప్రస్తుతం ఈ సెగ చల్లారినట్టే అనిపిస్తున్నా తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేం. 2014లో వర్మ ఇండిపెండెంట్‌గా పోటి చేసి పిఠాపురం నుంచి గెలిపొందిన విషయాన్ని పవన్‌ దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు విశ్లేషకులు. ఇలా పిఠాపురం రాజకీయం సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 19 =