జగ్గంపేట వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చింది అందుకేనా..?

Jaggampet YCP Has Changed The Sitting MLA Because Of This, YCP Has Changed The Sitting MLA, Jaggampet Sitting MLA Changed, Sitting MLA, Jaggampet, AP Assembly Elections, CM Jaga, Chandrababu Naidu, AP CM, Andhra Pradesh, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
Jaggampet, Ap Assembly elections, CM Jaga, Chandrababu naidu

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా వంద రోజుల సమయం కూడా లేదు. ఫిబ్రవరి రెండో వారంలో షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమైపోయాయి. ఆచితూచి బలమైన అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఈసారి ఏకంగా 50 నుంచి 60 మంది సిట్టింగ్‌లను మార్చేందుకు సిద్ధమయ్యారు. వారి స్థానంలో కొత్తవారిని వెతికే పనిలో పడ్డారు. అటు పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తోన్న జనసేన-టీడీపీ కూడా అభ్యర్థులను ఎంపికలో నిమగ్నమయ్యాయి.

అయితే ఏపీలో ఎన్నికల వేడి భగ్గుమంటోన్న వేళ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట నియోజకవర్గం చర్చనీయాంశంగా మారింది. అక్కడ బరిలోకి దిగబోయే నాయకులు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. అయితే కొన్నేళ్లుగా జగ్గంపేట నియోకవర్గంలో ఓ సెంటిమెంట్ కొనసాగుతోంది. ఆ స్థానం నుంచి ఒకసారి గెలిచిన అభ్యర్థి మరోసారి గెలిచిన దాఖలాలు లేవు. పార్టీలో సంబంధం లేకుండా అక్కడ అభ్యర్థులు ఓడిపోతున్నారు. అందుకే ప్రతిసారి కూడా పార్టీలు అక్కడి అభ్యర్థులను మారుస్తూ వస్తున్నాయి.

2009లో జగ్గం పేట నుంచి కాంగ్రెస్ తరుపున తోట నరసింహ పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2014లో కూడా పోటీ చేసినప్పటికీ ప్రజలు నరసింహను పక్కన పెట్టి.. వైసీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూను గెలిపించారు. ఇక 2019 ఎన్నికల్లో జ్యోతుల నెహ్రూను పక్కన పెట్టి ప్రజలు వైసీపీ అభ్యర్థులు జ్యోతుల చంటిబాబును గెలిపించారు. ఈక్రమంలో ఈసారి కూడా ఇదే సెంటిమెంట్ కొనసాగే అవకాశం ఉందని పార్టీలన్నీ భావిస్తున్నాయి

అందుకే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును మార్చినట్లు తెలుస్తోంది. ఈసెంటిమెంట్ కారణంగానే వైసీపీ జ్యోతులను పక్కన పెట్టి.. మరో అభ్యర్థి కోసం వెతుకుతున్నారు. ఇప్పటికే కొందరి పేర్లు పరిశీలనలోకి వచ్చాయట. త్వరలో వారిలో ఒకరిని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =