జనసేన పొలిట్ బ్యూరో నియామకం

Andhra Pradesh Political News, Janasena Announced Politburo Members list, Janasena chief Pawan Kalyan announced Janasena team list, JanaSena Party Declared Its Politburo And Political Affairs Committee, Mango News, Pawan Kalyan announces Jana Sena team list, Politburo Members list Released By Pawan Kalyan

2019 ఎన్నికలలో పరాజయం తరువాత, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పలుమార్లు పార్టీని బలోపేతం చేయడంపై నాయకులతో చర్చలు జరిపారు. పార్టీని రాష్ట్రవ్యాప్తంగా సంస్థాగతంగా మరింత పటిష్టం చేసేందుకు, తగిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా జూలై 26 న నలుగురు సభ్యులతో పొలిట్ బ్యూరో, 11 మంది సభ్యులతో పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఏర్పాటు చేసారు. జనసేన విధి విధానాలకు, సిద్ధాంతాలకు బద్ధులై క్షేత్ర స్థాయిలో మమేకం కావాలని, భావితరాల ప్రయోజనాలకు, యువత రాజకీయ చైతన్యానికి ప్రాధాన్యతనిస్తూ పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు.

పొలిట్ బ్యూరో:
1. శ్రీ నాదెండ్ల మనోహర్
2. శ్రీ పి. రామ్మోహనరావు
3. శ్రీ రాజు రవితేజ
4. శ్రీ ఆర్హం ఖాన్

జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ:

చైర్మన్: శ్రీ నాదెండ్ల మనోహర్

సభ్యులు:
1. శ్రీ తోట చంద్రశేఖర్
2. శ్రీ రాపాక వర ప్రసాద్ ( శాసన సభ్యులు)
3. శ్రీ కొణిదల నాగబాబు
4. శ్రీ కందుల దుర్గేష్
5. శ్రీ కోన తాతరావు
6. శ్రీ ముత్త శశిధర్
7. శ్రీమతి పాలవలస యశస్విని
8. శ్రీ డా. పసుపులేటి హరి ప్రసాద్
9. శ్రీ మనుక్షాంత్ రెడ్డి
10. శ్రీ ఏ. భరత్ భూషణ్
11. బీ. నాయకర్

క్రమశిక్షణ సంఘం చైర్మన్: మాదాసు గంగాధరం

 

[subscribe]
[youtube_video videoid=1pdOZVQlOYE]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + one =