శ్రీకాకుళంలో జనసేన ‘యువశక్తి’ బహిరంగ సభ ప్రారంభం.. పవన్ కళ్యాణ్‌కు సమస్యలు వివరించిన యువతీ యువకులు

Janasena Yuva Shakti Public Meeting Begins at Ranasthalam Srikakulam Party Chief Pawan Kalyan To Address,Janasena Yuva Shakti,Yuva Shakti Public Meeting,Ranasthalam Srikakulam,Party Chief Pawan Kalyan,Mango News,Mango News Telugu,Ranasthalam Srikakulam Dist,Yuvashakti Program Poster,Yuvashakti Program,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

శ్రీకాకుళం జిల్లా రణస్థలం వేదికగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ‘యువశక్తి’ బహిరంగ సభ ప్రారంభం అయింది. సుభద్రాపురం వద్ద ఒక ప్రైవేట్ స్థలంలో సభను ఏర్పాటు చేయగా.. రాష్ట్రం నలుమూలల నుంచి పవన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చారు. దీంతో ముందు జాగ్రత్తగా అక్కడ పోలీసులు భారీ సిబ్బందిని నియమించారు. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ బుధవారమే విజయనగరం జిల్లాకు చేరుకుని రాత్రికి భోగాపురంలోని ఒక ప్రైవేట్ రిసార్ట్స్ లో బస చేశారు. ఈరోజు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యుడు నాగబాబు తదితరులతో కలిసి సభాస్థలికి చేరుకున్నారు.

ఇక ఈ వేదిక ద్వారా ముఖ్యంగా ఉత్తరాంధ్ర యువతరంగాలను ఒకేచోటకు తీసుకొచ్చేలా, అక్కడి సమస్యలపై గళమెత్తేలా, సంస్కృతి, సంప్రదాయం, సాహిత్యం ప్రపంచానికి చాటిచెప్పేలా దీనిని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తొలుత 100 మంది యువతీ యువకులు ప్రస్తుతం రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న పలు సమస్యలు.. వాటి పరిష్కారానికి సూచనలపై ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వాలు ప్రజలందరినీ సమదృష్టితో చూడాలంటూ, పక్షపాత ధోరణి సరికాదు అంటూ ఒక ముస్లిం యువతి భగవద్గీత శ్లోకాన్ని చదివి వినిపించడం విశేషం. ఇక చివరిగా పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. యువతీ యువకులు తన దృష్టికి తెచ్చిన సమస్యలపై స్పందించి వారికి భరోసా ఇవ్వనున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఇప్పటికే దీనిపై స్పందిస్తూ.. ఈ కార్యక్రమం ఉద్దేశం ఒక్కటేనని, ‘మన యువత, మన భవిత’ అనేదే ప్రధాన నినాదంగా యువశక్తిని విజయవంతం చేద్దామని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =