చంద్రబాబు స్నేహితుడికే టికెట్‌!

big shock for janasena pothina mahesh as vijayawada west mla ticket goes to bjp sujana chowdary
big shock for janasena pothina mahesh as vijayawada west mla ticket goes to bjp sujana chowdary

అనుకున్నదే అయ్యింది.. విజయవాడ వెస్ట్‌ టికెట్‌ బీజేపీ పట్టుకుపోయింది. పక్కా లోకల్‌గా.. అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే రాజకీయంగా యాక్టివ్‌గా ఉన్న పోతిన మహేశ్‌కు నిరాశే మిగిలింది. టీడీపీ అధినేత చంద్రబాబు స్నేహితుడు, బీజేపీ నేత సుజనా చౌదరికి టికెట్‌ కన్ఫర్మ్‌ అయ్యింది. నిజానికి పొత్తులో భాగంగా ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి జనసేన రెండు అసెంబ్లీ టికెట్లు ఆశించింది. ఒకటి ఆవనిగడ్డ.. రెండోది విజయవాడ వెస్ట్. ఈ రెండు స్థానాలపైనా రచ్చ కొనసాగుతోంది. విజయవాడ వెస్ట్‌ టికెట్ తనకే ఇవ్వాలని పోతిన మహేశ్‌ నిరాహార దీక్షకు కూడా కూర్చున్నారు. సుజనా చౌదరి పేరు తెరపైకి వచ్చిన నాటి నుంచి పోతిన మహేశ్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అయినా పోతినకు టికెట్ దక్కకపోవడం ఇప్పుడు బెజవాడ నాట చర్చనీయాంశంగా మారింది.

పోతిన మహేశ్‌కు విజయవాడ వెస్ట్‌పై మంచి పట్టు ఉంది. ఈ ప్రాంతంలో అణువణువూ తెలిసిన నేతగా అతడిని ప్రజలు గుర్తించారు. ఐదేళ్లుగా ఎన్నో కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్‌ లాంటి నేతలను మకాం మార్చుకునేలా చేశారన్న ప్రచారం కూడా ఉంది. పోతిన మహేశ్‌ పవన్‌ కల్యాణ్‌కు చాలా సన్నిహితుడు కూడా. పవన్‌తో ఆయనకు మంచి సంబంధాలే ఉన్నాయి. అందుకే పోతిన మహేశ్‌కు విజయవాడ వెస్ట్‌ టికెట్‌ దక్కడం ఖాయమని అంతా అనుకున్నారు. పవన్‌ కూడా మహేశ్‌కు ఈ విషయమై మాట ఇచ్చినట్టుగా అతని అనుచరులు చెబుతుంటారు. అయితే పొత్తులో భాగంగా బీజేపీకి పది అసెంబ్లీ సీట్లు కేటాయించడం, టీడీపీ నుంచి బీజేపీకి వలస వెళ్లిన సుజనా చౌదరి ఇక్కడ టికెట్ ఆశించడంతో చివరకు పోతిన మహేశ్‌కు టికెట్‌ దక్కకుండా పోయిందంటున్నారు విశ్లేషకులు.

విజయవాడ వెస్ట్ సీటు జనసేనకు తప్ప ఎవరికీ ఇచ్చినా వైసీపీని ఢీకొట్టలేరన్నది పోతిన మహేశ్‌ మాట. అందుకే తనకు కాకపోయినా జనసేనలో ఎవరికైనా టికెట్ ఇవ్వాలని పోతిన మహేశ్‌ చెబుతూ వచ్చారు. నిజానికి ఇక్కడ టీడీపీ నుంచి కూడా జనసేనకు పోటి ఎదురైంది. జలీల్‌ఖాన్‌ సైతం విజయవాడ వెస్ట్‌ టికెట్ కావాలని అడిగారు. అయితే చివరిలో అనూహ్యంగా సుజనా చౌదరి పేరు తెరపైకి వచ్చింది. బీజేపీలో ఉంటూ పెద్దగా జనం మధ్య తిరగని సుజనా చౌదరి చంద్రబాబునాయుడుకు చాలా క్లోజ్‌. టీడీపీ లాబియింగ్‌తోనే సుజనాకు టికెట్ ఇచ్చారని పోతిన మహేశ్‌ అనుచరులు వాపోతున్నారు. అసలు నియోజకవర్గంలో సుజనా తిరగలేదని.. పోతిన మహేశ్‌ ఎంతో కష్టపడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక టికెట్ల ప్రకటనకు ముందు పోతిన మహేశ్‌తో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. మరోవైపు మహేశ్‌ ఇండిపెండెంట్‌గానైనా పోటి చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. మరి చూడాలి పవన్‌ మాటలు విని మహేశ్‌ సైలంట్ అవుతారో లేదా తాడో పెడో తేల్చుకుంటారో.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + twelve =