ఎచ్చెర్ల ఓటర్ల నాడి పట్టుకోగలరా?

Srikakulam, Etcherla,TDP,COngress, YCP, Janasena, Bjp, Gorle Kiran Kumar, Kimidi Kala Venkatrao, Jagan, Chandra Babu, Pawan Kalyan,AP Elections,Mango News Telugu,Mango News
Srikakulam, Etcherla,TDP,COngress, YCP, Janasena, Bjp, Gorle Kiran Kumar, Kimidi Kala Venkatrao, Jagan, Chandra Babu, Pawan Kalyan,

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న కొద్దీ.. ఏ పార్టీకా పార్టీ గెలుపు కోసం  అన్నిరకాలుగా వ్యూహాలు రచించుకొని వాటిని అమలు పరుచుకుంటూ ముందుకు వెళుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి  శ్రీకాకుళం జిల్లాపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ దృష్టి సారించాయి. టీడీపీ ఆవిర్భవించిన తర్వాత ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో.. గత ఎన్నికల సమయంలో  మాత్రం వైసీపీ పైచేయి సాధించింది. అయితే ఇప్పుడు మరోసారి అవే ఫలితాలను రిపీట్ చేయాలని వైసీపీ ప్రయత్నిస్తుండగా, తమ పట్టును నిరూపించుకోవాలనే కసితో  టీడీపీ ఉంది.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కీలకమైన నియోజకవర్గంగా ఎచ్చెర్లను చెబుతారు.  2014 ఎన్నికల బరిలో నిలబడ్డ కిమిడి కళా వెంకట్రావు ..వైసీపీ తరఫున బరిలోకి దిగిన  పిన్నిటి సాయిపై 4741 ఓట్ల తేడాతో గెలుపును కైవసం చేసుకున్నారు. అయితే  2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీ తరఫున బరిలో దిగిన గొర్లె కిరణ్ కుమార్ విజయం సాధించారు. టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావుపై  గొర్లె కిరణ్ కుమార్ 18,711 ఓట్ల తేడాతో  గెలుపొందారు.

ఎచ్చెర్ల  నియోజకవర్గంగా ఏర్పాటైన తర్వాత 1967లో  జరిగిన మొదటి ఎన్నికలలో.. కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగిన ఎన్ ఏ నాయుడు ఘనవిజయం సాధించారు. తర్వాత  జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి, ఆ తర్వాత ఎన్నికల్లో జనతా పార్టీ గెలిచాయి. అయితే 1983లో టీడీపీ ఆవిర్భావం తర్వాత వరుసగా ఐదు ఎన్నికల్లో కూడా  కె.ప్రతిభా భారతి విజయ బావుటాను ఎగరవేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా గెలిచిన కొండ్రు మురళీమోహన్ 2004లో ఎచ్చెర్ల నుంచి విజయం సాధించారు.

అయితే ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణాలు, పొత్తుల నేపథ్యంలో కిమిడి కళా వెంకట్రావుకు  చంద్రబాబు సీటు ఇస్తారా? లేదంటే వేరే కొత్త వ్యక్తిని అక్కడ టీడీపీ అభ్యర్ధిగానో లేక టీడీపీ కూటమి అభ్యర్ధిగానో  నిలబెడతారో అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అలాగే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కిరణ్ కుమార్‌కే  సీఎం జగన్ మరోసారి సీటు ఇస్తారా? లేదా సర్వేల పేరుతో కొత్త అభ్యర్ధిని తెరమీదకు తెస్తారా అనేదానిపైన కూడా వైసీపీ వర్గాలు ఏమీ చెప్పలేకపోతున్నాయి. కాకపోతే అక్కడ గెలుపు కోసం  రెండు పార్టీలు  కూడా బలమైన అభ్యర్ధిని నిలబెట్టే అవకాశాలున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 15 =