ఉద్యమ సమయంలోని కేసులు ఎత్తివేతపై.. సీఎం జగన్‌​కు కృత‍జ్ఞతలు తెలిపిన ముద్రగడ

Andhra Pradesh, AP CM YS Jagan, AP News, Cancellation of Cases During Kapu Movement, Kapu leader Mudragada Padmanabham, Kapu leader Mudragada Padmanabham writes to AP CM, Kapu Movement, Mango News, Mango News Telugu, Mudragada Padmanabham, Mudragada Padmanabham Thanks To AP CM YS Jagan, Mudragada Padmanabham Thanks To AP CM YS Jagan on Cancellation of Cases During Kapu Movement, Mudragada Padmanabham thanks YS Jagan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రముఖ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కాపు ఉద్యమానికి సంబంధించి అప్పటి ప్రభుత్వం పెట్టిన పలు కేసులను ఎత్తివేయడంపై ముద్రగడ సంతోషం వ్యక్తం చేశారు. ఈమేరకు సీఎం జగన్‌కు శుక్రవారం లేఖ రాశారు ముద్రగడ పద్మనాభం. లేఖలో సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు ఆయన. తన కాపు జాతికోసం అప్పట్లో పోరాడతానని.. దీనికి ప్రతిఫలంగా గత ప్రభుత్వం చేయని నేరానికి తమను ముద్దాయిలను చేస్తూ అన్యాయంగా అనేక కేసులు పెట్టిందని ముద్రగడ వాపోయారు. అయితే, ప్రస్తుతం వాటిని సీఎం జగన్ ప్రభుత్వం ఎత్తివేయడంపై లేఖలో కృతఙ్ఞతలు తెలియజేసారు ముద్రగడ.

కాగా, కాపుజాతి తనను ఉద్యమం నుంచి తప్పించిందని లేఖలో ముద్రగడ తన బాధను వ్యక్తం చేశారు. అయితే,ఆ దేవుడే సీఎం వైఎస్‌ జగన్‌ ద్వారా ఆ కేసులకు మోక్షం కలిగించారని హర్షం వ్యక్తం చేశారు ముద్రగడ. దీనిపై ఆయనను ప్రత్యేకంగా కలిసి కృతఙ్ఞతలు తెలపాలనుకున్నానని.. కానీ అనవసర అనుమానాలకు తావివ్వడం యష్టం లేకనే సీఎం వైఎస్‌ జగన్‌ను వ్యక్తిగతంగా కలవలేకపోతున్నానని ఆ లేఖలో పేర్కొన్నారు ముద్రగడ. ఒకవేళ తాను సీఎం జగన్ ను కలిస్తే, తమ జాతిని అడ్డుపెట్టుకొని కోట్లు సంపాదించుకోవడానికి పదవులు పొందడానికి వెళ్లానని విమర్శలు వస్తాయని ముద్రగడ అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − two =