పెన్షన్‌ వార్‌లో నలిగిపోతున్న వృద్ధులు!

Political Color Of EC Decision On Volunteers.., Political Color, EC Decision On Volunteers, Volunteers, EC Decision, Pension War In Andhra Pradesh, Election Commission Stops Volunteers, Volunteers To Distribute Money, Pension War, Election Commission, General Elections, Lok Sabha Elections, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News
pension war in andhra pradesh amid election commission stops volunteers to distribute money telugu news

ఏపీలో ఏం జరిగినా అది రాజకీయానికి ముడిపడి ఉంటుంది. అలాంటిది ఎన్నికల వేళ ఈసీ నిర్ణయాలకు రాజకీయ రంగు పులుముకోకుండా ఉంటుందా? వాలంటీర్లపై భారత ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఏపీ రాజకీయలను కుదిపేస్తోంది. అటు వైసీపీ, ఇటు కూటమి(టీడీపీ-జనసేన-బీజేపీ) వార్‌ మధ్య సామాన్యులు మరోసారి నలిగిపోయే దుస్థితి దాపరించింది. పింఛన్ల పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పెద్దఎత్తున వినియోగించుకోవడం మానుకోవాలని, వారి మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్‌లను స్వాధీనం చేసుకోవాలని వైసీపీ ప్రభుత్వాన్ని కోరుతూ భారత ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వాలంటీర్లపై టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేయడం ద్వారా పింఛన్‌దారులకు నష్టం, ఇబ్బందులకు గురి చేసిందని వైసీపీ ఆరోపిస్తోంది.

సచివాలయాల ద్వారా తీసుకోవచ్చు: టీడీపీ

మరోవైపువాలంటీర్లను వైసీపీ ఎన్నికల ప్రచారానికి వాడుకుంటోందని టీడీపీ వాదిస్తోంది. వాలంటీర్లపై ఈసీ ఆంక్షలు విధిస్తే అది పింఛన్‌లు ఆపడం ఎలా అవుతుందో చెప్పాలని నిలదీస్తోంది. ఫించన్లు ఇవ్వకుండా వైసీపీ తమపై తప్పుడు ప్రచారం చేస్తోందని చెబుతోంది. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి పింఛన్లు తీసుకునే అవకాశం ఉందని.. కేవలం వాలంటీర్లు మాత్రమే పెన్షన్ ఇవ్వాలని రూల్‌ లేదు కదా అని ప్రశ్నిస్తోంది. వార్డు, గ్రామ సచివాలయ సిబ్బందికి అవసరమైన డబ్బును బ్యాంకుల నుంచి డ్రా చేసుకునేందుకు, పోలీసులు ఆ డబ్బును అనుమతించాలని చెబుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈసీని కోరినట్లు సైకిల్‌ పార్టీ చెబుతోంది.

టీడీపీ కావాలనే చేసింది: వైసీపీ

మరోవైపు వైసీపీ మాత్రం టీడీపీపై అగ్గిమీద గుగ్గిలమవుతుంది. టీడీపీ కావాలనే కుట్ర చేసి పెన్షన్‌దారులకు డబ్బులు వెళ్లకుండా చేసిందని మండిపడుతోంది. అటు వాలంటీర్లు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు. రాజీనామా చేసిన వాలంటీర్లు నేరుగా వైసీపీ తరపున ప్రచారం చేయాలని భావిస్తున్నారు. రాజీనామా చేసినందున వారి కార్యకలాపాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. వీరిని కూడా పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోబెట్టాలని వైసీపీ నేతలు ఆలోచిస్తున్నారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ని నియమించారు. సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకు ఇంటి వద్దకే అందజేస్తున్నారు. వాలంటీర్లు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చాలా ప్రాంతాల్లో విమర్శలు, ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 13 =