తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా షేక్ సాబ్జీ విజయం

AP Politics, AP Teachers MLC Elections Results, AP Teachers MLC Elections Results 2021, East Godavari-West Godavari Teachers MLC Elections, Mango News, Shaik Sabzi, Shaik Sabzi Won in East Godavari-West Godavari Teachers MLC Elections, Shaik Sabzi Won in Teachers MLC Elections, Teachers MLC Elections, Teachers MLC Elections 2021, Teachers MLC Elections Results, Teachers MLC Elections Results 2021, West Godavari Teachers MLC Elections

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో యూటీఎఫ్ అభ్యర్థి షేక్ సాబ్జీ విజయం సాధించారు. పీఆర్టీయూ మద్దతుతో పోటీలో ఉన్న గంధం నారాయణరావుపై 1537 ఓట్ల మెజార్టీతో షేక్ సాబ్జీ గెలుపొందారు. మరోవైపు కృష్ణా-గుంటూరు స్థానాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఫలితం ఇంకా తేలాల్సి ఉంది.

ముందుగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు మార్చి 14న పోలింగ్ జరగగా, బుధవారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టారు. తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపును కాకినాడ జేఎన్‌టీయూ కాలేజీలో చేపట్టగా, కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు ప్రక్రియ గుంటూరు ఏసీ కాలేజీలో జరుగుతుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులే ఎక్కువగా బరిలో నిలిచారు. ఏపీలోని అన్ని పార్టీలు ప్రత్యేకంగా అభ్యర్థులను ఎంపిక చేసి పోటీలో ఉంచలేదు. తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి స్థానంలో 11 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, కృష్ణా-గుంటూరు స్థానంలో 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ రెండు స్థానాలకు కలిపి 30,972 మంది ఓటర్లుండగా, 92.41 శాతం అనగా 28,622 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 18 =