జగన్, చంద్రబాబులకు షర్మిల లేఖ

YS Sharmila, Chandrababu, AP Politics, letter to Jagan and Chandrababu, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Elections, Andhra pradesh, jagan latest updates, AP CM, jagan mohan reddy, AP Assembly, Mango News Telugu, Mango News
YS Sharmila, Chandrababu, YS Sharmila, AP Politics

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వైఎస్ షర్మిల దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఓవైపు రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తూనే.. మరోవైపు అధికార వైసీపీ, తెలుగు దేశం, జనసేన పార్టీలపై విరుచుకుపడుతున్నారు. విమర్శల బాణాలతో తూట్లు పొడుస్తున్నారు. ముఖ్యంగా తన సోదరుడు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని టార్గెట్‌గా చేసుకొని.. ప్రభుత్వ తప్పులను ఎండగడుతున్నారు. ఇదిలా ఉండగా.. వైఎస్ షర్మిల తన సోదరుడు జగన్, చంద్రబాబు నాయుడులకు లేఖ రాశారు. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

ముందు నుంచి కూడా ఏపీకి ప్రత్యేక హోదా, కేంద్రం అమలు చేయని విభజన హామీలే టార్గెట్‌గా షర్మిల తన గలం వినిపిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున.. ఆ అంశాలపై చర్చ జరపాలని జగన్, చంద్రబాబు నాయుడులకు షర్మిల లేఖ రాశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పదేళ్లుగా ఏపీ ప్రజలను మోసం చేస్తోందని షర్మిల పేర్కొన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేసిన మోసానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని.. దానిని రాష్ట్రపతికి పంపించాలని షర్మిల.. చంద్రబాబు, జగన్‌లను కోరారు.

ప్రత్యేక హోదా సహా ఏపీకి ఇచ్చిన విభజన హామీలు రాష్ట్ర ప్రజల హక్కు అని షర్మిల పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లలో అటు కేంద్రంలో బీజేపీ.. రాష్ట్రంలో ఐదేండ్లు టీడీపీ, ఇప్పుడు వైసీపీ పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్నప్పటికీ.. పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదని షర్మిల పేర్కొన్నారు. ఇది అత్యంత దురదృష్టకరమన్నారు. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విభజన హామీలను పూర్తిగా పక్కకు పెట్టేసిందని మండిపడ్డారు.  ఏపీ హక్కుల తీర్మానం కోసం అన్ని పార్టీలు కలిసికట్టుగా డిమాండ్ చెయ్యాలని షర్మిల కోరారు.

గతంలో సంక్షేమం, అభివృద్ధితో పాటు దేశానికే అన్నపూర్ణగా నిలిచిన ఆంధ్రప్రదేశ్.. ఇప్పుడు అన్ని రంగాల్లో నిర్లక్ష్యానికి గురవుతోందని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రతిపక్షాలన్నీ ఏకమై, రాజకీయాలకు అతీతంగా, రాష్ట్రం కోసం నిలబడాలని పిలుపునిచ్చారు. ఏపీకి పదేళ్లలో జరిగిన అన్యాయాన్ని, నష్టాన్ని గుర్తు చేస్తూ ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలులో జాప్యాన్ని గుర్తు చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు, జగన్‌లకు ఈ లేఖ రాస్తున్నట్లు వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 9 =