టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు బహిష్కరణ

Andhra Pradesh, AP Coronavirus, AP MPTC And ZPTC Unanimous Polls, ap mptc zptc elections, AP ZPTC Elections, Chandrababu Announced that Party Boycotts ZPTC and MPTC Elections, Mango News, MPTC and ZPTC Elections, MPTC And ZPTC Unanimous Polls, MPTC ZPTC Elections, MPTC ZPTC Elections Polling, Party Boycotts ZPTC and MPTC Elections, TDP Chief Chandrababu, TDP Party Boycotts ZPTC and MPTC Elections, YS Jagan Mohan Reddy

ఏపీలో ఏప్రిల్ 8 న జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శుక్రవారం నాడు మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆవేదన, బాధతో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు అప్రజాస్వామికంగా జరుగుతున్నాయని అన్నారు. రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకుంటామని చెప్పి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. 2014 లో 2 శాతం ఎంపీటీసీలు ఏకగ్రీవం కాగా ప్రస్తుతం 24 శాతం అయ్యాయని, అలాగే అప్పుడు 0.9 శాతం జెడ్పీటీసీ ఎన్నికలు ఏకగ్రీవం కాగా, ఇప్పుడు 19 శాతం అయ్యాయని చెప్పారు.

ఎన్నికలు స్వేచ్ఛాయుత పద్ధతిలో జరుగుతాయని నమ్మకం లేదని అన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ పార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగవన్న విషయాన్ని తెలిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గతంలో కూడా తమిళనాడులో దివంగత సీఎం జయలలిత, పశ్చిమబెంగాల్ లో దివంగత సీఎం జ్యోతిబసు కూడా స్థానిక ఎన్నికలను బహిష్కరించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీడీపీ తీసుకున్న ఈ కఠిన నిర్ణయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని చంద్రబాబు కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =