ఏపీలో బీజేపీ పొత్తులకు చంద్రబాబు దూరం.. మరి పవన్ రియాక్షన్?

TDP Chief Chandrababu Dont Want to Respond on Alliance with BJP in AP But What About Janasena President Pawan Kalyan,TDP Chief Chandrababu Dont Want to Respond on Alliance,Dont Want to Respond on Alliance with BJP,Alliance with BJP in AP,About Janasena President Pawan Kalyan,Janasena President Pawan Kalyan,Mango News,Mango News Telugu,PAVAN KALYAN, CHANDRA BABU, JANASENA, BJP, AP CM JAGAN, AP POLITICS, ALLIANCE,TDP Chief Chandrababu Latest News,TDP Chief Chandrababu Latest Updates,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates

ఏపీలో పొలిటికల్ సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. మొన్నటి వరకూ.. ఈసారి కూడా వైసీసీ జెండా పాతేయొచ్చన్న ధైర్యంతో ఉన్న జగన్ సర్కార్ ఇప్పుడు.. ఈ సారి జనసేన గండం నుంచి గట్టెక్కేదెలా అని మల్లగుల్లాలు పడుతోంది. ఓ వైపు దమ్ముంటే సింగిల్‌గా పోటీ చేయమని పవన్ కళ్యాణ్‌ను రెచ్చగొట్టేలా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నా.. పవన్ కళ్యాణ్‌ మాత్రం ఒంటరిపోరుపైన కానీ పొత్తులపై కానీ నోరు మెదపడం లేదు. అటు బీజేపీ చూస్తే జనసేనతోనే మేము అంటూ చెప్పుకొస్తుంది. కానీ చంద్రబాబును కలుపుకొని పోవడానికి మాత్రం ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. గతంలో బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు చేపట్టిన కార్యక్రమాలను, చేసిన కామెంట్లను బీజేపీ నేతలు ఇప్పటికీ మరచిపోకపోవడమే కారణమన్న వాదన టీడీపీలోనూ వినిపిస్తోంది. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పవన్ మాటలకు మద్దతిస్తూనే ఉన్నా.. పొత్తులపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.

మరోవైపు చంద్రబాబు కన్నా వైఎస్ జగన్ తమకు ముఖ్యమనే అభిప్రాయంతోనే.. బీజేపీ అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో గతంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటూ బాబును నమ్మేకంటే.. జగన్‌తో ఇలాగే కంటెన్యూ చేద్దామనే ఆలోచనలోనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుకునే పొత్తులపై బీజేపీ ఇప్పటికే స్పష్టమైన వైఖరి తీసుకుందనే అభిప్రాయం జనాల్లోకి ఇప్పటికే వెళ్లిపోయింది. అందుకే మంగళవారం జరిగిన ఎన్డీఏ సమవేశానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఆహ్వానం అందలేదన్న వాదన వినిపిస్తోంది. చాలా కాలంగా చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఆసక్తి ప్రదర్శిస్తున్నా.. ఇప్పుడు జరిగిన సంఘటన ఆయన ఆశలపై నీళ్లు పోసినట్లే అయింది. ఇటు ఏపీలో ఏం చేసినా బలం పెంచుకోగలమే కానీ.. అధికారంలోకి రాలేమన్న విషయం బీజేపీలోని గల్లీ నేతను అడిగినా చెబుతాడు. పోనీ అలా అని టీడీపీతో పొత్తు పెట్టుకుంటే గతంలో జరిగిన అనుభవం మళ్లీ జరుగుతుందన్న అనుమానం పీకుతోంది. దీంతోనే జగన్‌ వైపే ఢిల్లీ పెద్దలు చూపు ఉంటోందన్న వాదన వినిపిస్తోంది.

గతనెలలో చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అవడంతో.. ఇటు బీజేపీ కూడా టీడీపీకి స్నేహ హస్తం అందిస్తుందన్న ప్రచారం జరిగింది. దీని వెనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీపై తెచ్చిన ఒత్తిడే అని టాక్ వినిపించింది. అయితే, ఆ భేటీ తర్వాత.. అటు బీజేపీ నుంచి కానీ, ఇటు టీడీపీ నుంచి ఎటువంటి కదలికలు లేదు. తర్వాత చంద్రబాబు ఢిల్లీ పెద్దలను కలవలేదు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి భేటీకి పవన్ కళ్యాణ్‌కు ఆహ్వనం పంపిన బీజేపీ అధిష్టానం.. చంద్రబాబును మాత్రం పిలవలేదు. దీంతోనే పొత్తు లేదన్న సంకేతాలను పంపినట్లు అయింది. అలా అని చెప్పి ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను ఆహ్వానించారా అంటే.. జగన్‌కు కూడా ఆహ్వానం అందలేదు. ఎందుకంటే ఎన్డీఎలో చేరడానికి ఏపీ సీఎం ఎప్పుడూ ఆసక్తి చూపించలేదు. కానీ కేంద్ర ప్రభుత్వంతో ఎప్పుడూ విభేదించలేదు.. ఎప్పటికప్పుడు ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలోనే ఉంటారు. దీంతోనే చంద్రబాబుతో పోల్చుకుంటే జగన్ తమ పార్టీకి పనికొస్తారన్న అభిప్రాయంతో బీజేపీ అగ్రనేతలు ఉన్నారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ మాత్రం ఎలా అయినా జగన్ ను గద్దె దించాలని కంకణం పెట్టుకున్నారు. ఒకప్పుడు పవన్‌వి నిలకడ లేని మాటలు అంటూ కౌంటర్లు వేసిన నేతల్లో ఏ ఒక్క నేత కూడా ఇప్పుడు పవన్ అడిగిన.. అడుగుతున్న ఒక్క ప్రశ్నకు కూడా దమ్మున్న సమాధానంతో ముందుకు రాలేకపోతున్నారు. మొన్నటి వరకూ సీఎంతో సహా పవన్ వ్యక్తిగత విషయాలను తవ్వుతూ పవన్ ను కించపరిస్తూ వచ్చారు. కానీ అవి బూమ్ రాంగ్‌లా చివరకు తమ మెడకే చుట్టుకుంటూ ప్రజల నుంచి మరింత సింపతీని పవన్ ఖాతాలో వేస్తున్నారన్న విషయాన్ని ఆలస్యంగా గ్రహించారు వైసీపీ నేతలు. సరిగ్గా అలాంటి సమయంలోనే వాలెంటర్ వ్యవస్థ మీద పవన్ కామెంట్లను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూసినా.. అది కూడా కొద్ది రోజులకే జనాలకు ఇవ్వాల్సిన వివరణతో పవన్ వాళ్లను సమాధానపరిచేశారు. దీంతోనే వచ్చే ఎన్నికల్లో జనసేన గండం గట్టిగానే ఉంటుందన్న సంకేతాలు వైసీపీ నేతల్లోకి వెళ్లిపోయాయి.

జగన్‌‌ను ఓడించడానికి ప్రతిపక్షాల ఓట్లు చీలిపోకూడదనే అభిప్రాయంతోనే మొదటి నుంచీ ఉన్న పవన్ మాత్రం టీడీపీతో పొత్తు అవసరమే అని భావిస్తున్నారు. బీజేపీ, టీడీపీలతో కలిపి వైసీపీని ఓడించడమే మెయిన్ అజెండాగా పవన్ ఆలోచిస్తున్నారు. దీంతోనే బీజేపీని ఎలా అయినా ఒప్పించి టీడీపీతో పొత్తుకు ఓకే అనిపించాలని అనుకుంటున్నారు. కానీ ఎన్డీఏ సమావేశానికి చంద్రబాబుకు ఆహ్వానం అందకపోవడంతో.. ఇటు పవన్‌కు కూడా టీడీపీతో పొత్తు వద్దని ఓ హింట్ ఇచ్చినట్లే అయింది. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. మారే రాజకీయ పరిణామాలలో రాజీ ప్రయత్నాలు పనిచేస్తాయని రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఏపీలో పొత్తులకు టీడీపీ దూరం అయింది కాబట్టి.. పవన్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని.. పవన్ వేసే తరువాత అడుగు ఎంత బలంగా ఉంటుందో అని తెలుగు రాష్ట్రాలలో వేడివేడిగా చర్చ జరుగుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 17 =