యుద్ధం ఇప్పుడే మొదలయింది: నారా లోకేష్

The battle has just begun says Nara Lokesh,The battle has just begun,battle begun says Nara Lokesh,Nara lokesh, TDP, Yuvagalam,Mango News,Mango News Telugu,lokesh yuvagalam,Nara Lokesh concludes Yuva Galam yatra,Chandrababu Naidu and Pawan Kalyan,TDP general secretary Nara Lokesh,Nara Lokesh At Yuvagalam,Nara Lokesh Exclusive Interview,Nara Lokesh Latest News,Nara Lokesh Latest Updates,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates
Nara lokesh, TDP, Yuvagalam

ప్రజలు పాదయాత్ర చేస్తే పోరాటం అవుతుందని.. రాక్షస పాలనలో పోరాటం చేస్తే విప్లవం అవుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. విజయనగరంలో జరిగిన యువగళం ముగింపు సభలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ది రాజారెడ్డి రాజ్యాంగం పొగరు అని.. లోకేష్‌ది అంబేడ్కర్ రాజ్యాంగం పౌరుషం అని వ్యాఖ్యానించారు. ఇది నవశకం, యుద్ధం ఇప్పుడే మొదలయిందని.. తాడేపల్లి తలుపులు బద్ధలుకొట్టే వరకు ఈ యుద్ధం ఆగదని లోకేష్ వెల్లడించారు.

యువగళం పాదయాత్ర ఎన్నో పాఠాలు నేర్పిందని.. అడుగడుగునా జగన్ విధ్వంసం కనిపించిందని లోకేష్ వెల్లడించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. జనసేనాని పవన్ కళ్యాణ్‌లను చూస్తే జగన్‌కు భయమేస్తుందని  వ్యాఖ్యానించారు. ఎటువంటి తప్పు చేయని చంద్రబాబును రాజకీయ కక్షతో అరెస్ట్ చేయించి జైలుకు పంపించారని మండిపడ్డారు. విజనరీ అంటే చంద్రబాబుది అన్న లోకేష్.. ప్రిజనరీ అంటే జగన్ అని విమర్శించారు. జగన్ అరెస్ట్ అయితే రోజుకో స్కామ్ బయటపడేదని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని జగన్ దెబ్బ తీశారని.. లక్షల కోట్లు దోచుకున్న వ్యక్తి పేదవాడు ఎలా అవుతారని ప్రశ్నించారు.

ఆడుదాం ఆంధ్రా అని జగన్ అంటుంటే.. మా జీవితాలతో ఆడారని జనం అంటున్నారని లోకేష్ వ్యాఖ్యానించారు. జగన్ ఐపీఎల్ టీమ్ పేరు కోడికత్తి వారియర్స్ అని.. కోడికత్తి వారియర్స్ అరగంట స్టార్ అంబటి.. బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్.. ఆల్ రౌండర్ గోరంట్ల మాధవ్.. గంట స్టార్ అవంతి.. పించ్ హిట్టర్ బియ్యపు మధుసూదన్ రెడ్డి.. రీల్ స్టార్ భరత్ అని లోకేష్ విమర్శించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − seven =