వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు సింగరేణి డైరెక్టర్లు.. టేకోవర్‌ సాధ్యాసాధ్యాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి

Three Singareni Directors Visited Vizag Steel Plant Today After Telangana Govt Expressed Interest in Bidding,Three Singareni Directors Visited Vizag Steel Plant,Singareni Directors Visited Vizag Steel Plant,Vizag Steel Plant,Mango News,Mango News Telugu,Telangana Govt Expressed Interest in Bidding,Vizag Steel Plant Bidding,Vizag Steel Plant Bidding News,Vizag Steel Plant Bidding Latest News,Vizag Steel Plant Bidding News and Updates,Vizag Steel Plant Bidding News and Live Updates,Vizag Steel Plant Bidding Live Updates,Vizag Steel Plant Bidding News and Updates

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను టేకోవర్‌ చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సింగరేణి కాలరీస్‌ జాయింట్‌ వెంచర్‌ కింద ఎక్స్‌ప్రెషన్ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సింగరేణి జాయింట్‌ వెంచర్‌ కింద విశాఖ ఉక్కు పరిశ్రమ టేకోవర్‌ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేపట్టింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కోనుగోలు చేసే క్రమంలో.. తెలంగాణ స్టేట్ మినరల్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జయేశ్‌ రంజన్ నేతృత్వంలో బిడ్డింగ్‌కు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనిలో భాగంగా వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ వెళ్లి అక్కడి పరిస్థితులను సమీక్షించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మంగళవారం సింగరేణి సీఎండీ ఆదేశాల మేరకు ముగ్గురు డైరెక్టర్లు మంగళవారం విశాఖలోని స్టీల్‌ ప్లాంట్‌ను సందర్శించారు.

అయితే స్టీల్‌ప్లాంట్ సీఎండీ అందుబాటులో లేకపోవడంతో.. మార్కెటింగ్ సీజేఎం సత్యానందంతో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఇక ఈ అంశానికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కాగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలోని సింగరేణి ప్రైవేటీకరణతో పాటు ఏపీలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోన్న విషయం తెలిసిందే. మరోవైపు దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. విశా‌ఖ స్టీల్ ప్లాంట్‌తో పాటు ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరితో సంబంధం లేదని, తెలంగాణకు మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడటమే ముఖ్యమని, ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడాలన్నది సీఎం కేసీఆర్‌ విధానపరమైన నిర్ణయమని ప్రకటించడం విశేషం.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 15 =