40 యేళ్ళ క్రితం తెలుగుదేశం పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన చంద్రబాబు

Chandrababu Pays Homage To NTR Statue At Hyderabad MLA Quarters on TDP 40th Formation Day, Chandrababu Pays Homage To NTR Statue At Hyderabad MLA Quarters, NTR Statue At Hyderabad MLA Quarters, Hyderabad MLA Quarters, Chandrababu Pays Homage To NTR Statue, NTR Statue, TDP 40th Formation Day, Telugu Desam party 40th Formation Day, Telugu Desam party Formation Day, Formation Day Of Telugu Desam party, TDP Chief Chandrababu, Nara Chandrababu, TDP Chief Chandrababu Extends TDP 40th Formation Day Greetings to Party Leaders and Activists, TDP 40th Formation Day Greetings, TDP 40th Formation Day Wishes, Telugu Desam party Formation Day Latest Updates, Telugu Desam party Formation Day Latest News, Mango News, Mango News Telugu,

ఇప్పటికి 40 సంవత్సరాలు క్రితం 1982లో హైదరాబాద్ లోని ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. అప్పటినుంచి కేవలం 9 నెలల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావటం ఒక విశేషం. అందుకే ఈరోజు టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు ఎన్టీఆర్ కుమారుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా పాల్గొన్నారు.

అనంతరం చంద్రబాబు, బాలకృష్ణతోపాటు ఇరు రాష్ట్రాలలోని పలువురు టీడీపీ నేతలు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక అని, తెలుగు ప్రజలు ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ కూడా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కుడు, గూడు, గుడ్డ అనే నినాదంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని నిర్మించారని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు పాటుపడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ 40 యేళ్ళ సుదీర్ఘ ప్రస్థానంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొందని, అదే సందర్భంలో ఎంతోమంది యువకులను నాయకులుగా తీర్చిదిద్దిందని తెలిపారు. గెలుపోటములకు అతీతంగా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − seven =