ఆయన నెక్ట్స్‌ స్టెప్‌ ఏంటి?

What Is Vangaveeti Radha's Next Step?,No Option For Vangaveeti Radha Except For Campaigning TDP,Telugu News,TDP,YCP,Mango News,Mango News Telugu,Andhra Pradesh Elections,Elections 2024,AP Elections 2024,Lok Sabha Polls,AP Polls,AP Politics,AP News,AP Latest News,AP Elections News,AP Elections,AP Assembly Elections 2024,Lok Sabha Elections 2024,Vangaveeti Radha,Vangaveeti Radha News,TDP News,TDP Latest News,Vijayawada,Vijayawada Politics,Vijayawada News,Vangaveeti Radha Latest News,Vangaveeti Radha Election Campaign

1980వ దశకంలో వంగవీటి రంగ ఏపీ రాజకీయాల్లో ఓ సెన్సెషన్‌. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నిరహారదీక్ష చేస్తున్న ఆయన్ను ఘోరంగా హత్య చేశారు. నాడు ఎన్టీఆర్‌ హయంలో టీడీపీ అధికారంలో ఉంది. రంగ హత్య తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమిని మూటగట్టుకుంది. వంగవీటి రంగ గురించి విజయవాడ నాట ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే వంగవీటి తనయుడు రాధా గతంలో టీడీపీలో చేరడం ప్రకంపనలు రేపింది. విజయవాడ సెంట్రల్‌ టికెట్‌ అడిగిన రాధాకు వైసీపీ ఆ టికెట్‌ నిరాకరించడంతో ఆయన టీడీపీలో చేరారన్న ప్రచారం జరిగింది. అయితే అప్పటినుంచి రాధా పొలిటికల్‌గా యాక్టివ్‌గా లేరు. ఇక ఈ ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి పోటి చేస్తారని ప్రచారం జరిగినా ఆయనకు టికెట్ దక్కలేదు. ఇక ప్రస్తుతం ఆయనకు మిగిలిన పార్టీల నుంచి దారులన్ని మూసుకుపోయినట్టుగా తెలుస్తోంది.

టీడీపీలోనే..:మాజీ ఎమ్మెల్యే, కాపు నేత వంగవీటి రాధాకృష్ణ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కోసం ఇతర పార్టీల్లో ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తన తండ్రి వంగవీటి మోహన రంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో తరచూ పాల్గొనే ఆయన మిత్రులు కొడాలి నాని, వల్లభనేని వంశీలు వంగవీటిని వైసీపీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారు. కానీ విజయవాడలోని ఏ నియోజకవర్గం నుంచి టికెట్ వస్తుందని పార్టీ నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో అది సఫలం కాలేదు. గతంలో విజయవాడ (తూర్పు) నుంచి ప్రాతినిధ్యం వహించారు రాధా.

వంగవీటి జనసేన పార్టీలో చేరుతారని, ఆయనకు మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి టికెట్ దక్కే అవకాశం ఉందని ఇటీవల ప్రచారం జరిగింది. కొంతకాలం క్రితం ఆయన జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ను కలవడం కూడా ఊహాగానాలకు ఆజ్యం పోసింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలియదు కానీ ఆ తర్వాత వంగవీటి గురించి ఏమీ వినబడలేదు. ఇక ఇది జరుగుతున్న సమయంలోనే ఆయన విజయవాడ లోక్‌సభ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ అలియాస్ చిన్నితో సమావేశమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా వంగవీటిని నియమించి కాపుల్లో ప్రచారానికి నాయకత్వం వహించాలని చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. టీడీపీ అధికారంలోకి రాగానే వంగవీటికి మంచి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు

సమాచారం. విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరితో పాటు పలువురు కాపు సామాజికవర్గ నేతలను కూడా వంగవీటి కలిశారు. అయితే ఇలా పోటికి దూరంగా రాధా ఉండిపోవడానికి కారణం ఆయన టీడీపీలో చేరడమేనన్న ప్రచారం జరుగుతోంది. రాధా ఆ స్టెప్‌ తీసుకున్న తర్వాత నుంచి ఆయన అనుచరులు ఆయనకు దూరమైనట్టు విజయవాడులో చర్చించుకుంటారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 3 =