సిట్టింగ్‌లను మార్చడం వైసీపీకి లాభమా? నష్టమా?

AP Elections, YCP, YCP Sitting MLAs, YS Jagan Mohan Reddy, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Assembly, 2024 general elections, TDP, AP CM YS Jagan Mohan Reddy, AP Latest Political News, Mango News Telugu, Mango News
AP Elections, YCP, YCP Sitting MLAs, AP Elections

దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయని సాహసం చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. యాభైకి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కకు పెట్టేస్తున్నారు. పనితీరు బాగోలేని వారు.. ప్రజాబలం తగ్గిన వారు.. ఎంతటివారైనా ఏమాత్రం సహించకుండా సైడ్ చేసేస్తున్నారు. గతంలో దేశంలోనే అతిపెద్ద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ కూడా సిట్టింగ్‌లను ఛేంజ్ చేసింది. కానీ ఇంత పెద్ద ఎత్తున కాదు.. 40 మందినే మార్చేసింది.  జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒకేసారి 50 మందికి పైగా సిట్టింగ్‌లకు ఉద్వాసన పలుకుతున్నారు. అలాగే కొందరు ఎంపీలను అసెంబ్లీ బరిలోకి.. కొందరు ఎమ్మెల్యేలను లోక్ సభ బరిలోకి దింపుతున్నారు. తెలుగుదేశం-జనసేన కూటమి ఎత్తుగడలకు పై ఎత్తులు వేస్తూ.. వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే ఆరు విడతలుగా జగన్ అభ్యర్థులను ప్రకటించారు. మొత్త 61 అసెంబ్లీ స్థానాలకు.. 14 లోక్ సభ స్థానాలకు జగన్ ఇంఛార్జ్‌లను ప్రకటించారు.

అయితే జగన్ పెద్ద ఎత్తున సిట్టింగ్‌లను మార్చడం.. కొత్త ముఖాలను తెరపైకి తీసుకురావడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సిట్టింగ్‌లను మార్చడం వెనుకవున్న జగన్ వ్యూహాలు ఫలిస్తాయా?.. సిట్టింగ్‌లను మార్చడం వైసీపీకి ప్లస్ అవుతుందా? లేక మైనస్ అవుతుందా? అనే దానిపై పెద్ద ఎత్తున జనాలు చర్చించుకుంటున్నారు. కొత్త కొత్త ఊహాగాణాలు తెరపైకి వస్తున్నాయి. ఇదే సమయంలో పలు సర్వే సంస్థలు కూడా జగన్‌ సిట్టింగ్‌లను మార్చడంపై సర్వేలు చేస్తున్నాయి. ఎవరూ ఊహించని విషయలను బయటపెడుతున్నాయి. ఇలానే ఓ సంస్థ ఎన్నికల చిత్రలహరి పేరుతో ఏపీలో సర్వే చేసి సంచలన విషయాలను వెల్లడించింది.

పెద్ద ఎత్తున జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడం వైసీపీ గెలుపుపై ప్రభావం చూపుతుందా? అంటే.. సర్వేనివేదిక ప్రకారం 57 శాతం మంది ప్రజలు అవుననే అంటున్నారు. 24 శాతం మంది మాత్రం ఏమాత్రం ప్రభావం చూపదని చెబుతున్నారు. అదే సమయంలో 19 శాతం మంది మాత్రం ఏమీ చెప్పలేమని అంటున్నారు. సానుకూలంగా స్పందించిన 26 శాతం మందిలో 18 శాతం వైఎస్సార్‌సీపీ మద్ధతుదారులు.. 8 శాతం మంది టీడీపీ మద్ధతుదారులు సిట్టింగ్‌లను మార్చడం వైఎస్సార్‌సీపీ గెలుపుకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.

ఇదే సమయంలో 10 శాతం వైసీపీ మద్ధతుదారులు.. 21 శాతం టీడీపీ-జనసేన కూటమి మద్ధతుదారులు వైఎస్సార్‌సీపీ గెలుపు అవకాశాలను దిగజార్చుతుందని పేర్కొన్నారు. ఇక జగన్ సిట్టింగ్‌లను మార్చడం ఎటువంటి ప్రభావం చూపదని 24 శాతం మంది అభిప్రాయపడగా.. అందులో 9 శాతం మంది వైఎస్సార్‌సీపీ మద్ధతుదారులు.. 15 శాతం టీడీజీ-జనసేన మద్ధతుదారులు ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 15 =