రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం

Revanth Reddy is Another Sensational Decision,Revanth Reddy Sensational Decision,Another Sensational Decision,Revanth Reddy,CM Revanth reddy, Telangana CM, CM Convoy, Congress Government,Mango News,Mango News Telugu,Dont Stop The Traffic For My Convoy,Telangana CM Revanth Reddy,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News,Revanth Reddy Latest News,Revanth Reddy Latest Updates,Revanth Reddy Live News
CM Revanth reddy, Telangana CM, CM Convoy, Congress Government

సంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎం పదవి చేపట్టి నెల రోజులు కూడా కాకముందే.. స్పీడ్‌గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దూకుడుగా ముందుకెళ్తున్నారు. రోజుకు రెండు, మూడు శాఖలపై రివ్యూలు చేస్తూ.. అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆడంబరాలకు దూరంగా ఉంటూ.. ఖర్చల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆచితూచి అడుగులేస్తున్నారు. అవసరానికి మించిన హడావుడి అక్కర్లేదన్నట్లుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఇక శుక్రవారం పోలీస్ శాఖపై రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. ఈ సందర్భంగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్‌లో ఉండే 15 వాహనాలను 9 వాహనాలకు కుదించాలని పోలీస్ శాఖను ఆదేశించారు. అంతేకాకుండా తాను వెళ్తున్నప్పుడు ట్రాఫిక్‌ను ఆపి.. వాహనదారులను ఇబ్బందులకు గురి చెయ్యొద్దని సూచించారు. సీఎం కాన్వాయ్ వెళ్తున్నప్పుడు ఓ ఒక్కరూ ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంతేకాకుండా కాన్వాయ్ వెళ్తున్నప్పుడు ట్రాఫిక్‌ను నిలిపివేయకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సూచించారు.

అలాగే పోలీసుల కారణంగా నగర ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి.. మరోసారి అలా జరగకుండా చూసుకోవాలని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనల విషయంలో కూడా ప్రజలకు విసులుబాటు కల్పించాలన్నారు. అలాగే ముందు ముందు ప్రజల సమస్యల్ని తెలుసుకోవడానికి పెద్ద ఎత్తున పర్యటనలు చేస్తానని.. తాను ప్రయాణించే మార్గాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే తగిన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి పోలీసులకు సూచించారు.

అంతేకాకుండా పోలీసు నియామక ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా పోలీస్ ఉద్యోగ నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. నియామకాల్లో ఎట్టి పరిస్థిసతిల్లోనూ అవకతవకలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే నియామక ప్రక్రియలో ఉన్న లోటు పాట్లు, వాటిని అధిగమించే అంశాలపై తగిన నివేదికను అందివ్వాలని ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =