ఇక్కడ యంగటైగర్‌.. అక్కడ ఇళయ దళపతి.. రాజకీయాల్లోకి రావాలని ఫ్యాన్స్‌ ఒత్తిడి

Young Tiger NTR and Ilayathalapathy Vijay Getting Pressure From Their Fans to Get into Politics,Young Tiger NTR and Ilayathalapathy Vijay,Getting Pressure From Their Fans,Mango News,Mango News Telugu,Chiranjeevi,Fans pressure to enter politics,Ilaya Dalapathy Vijay,Rajinikanth,Pawan Kalyan,Young Tiger NTR,Young Tiger NTR and Ilayathalapathy Latest News,Vijay Fans to Get into Politics,Ilayathalapathy Vijay into Politics,Suspense over Jr NTR and Vijay Political Entry,Politically ambitious actor Vijay

హీరోల పొలిటికల్‌ ఎంట్రీలంటే అందరికీ ఇష్టమే. అప్పట్లో ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చి సక్సెస్‌ అందుకున్నారు. తర్వాత చాలామంది రాజకీయాల్లోకి వచ్చినా.. వాళ్లంత సక్సెస్‌ని మాత్రం అందుకోలేకపోయారు. 2008లో రాజకీయ పార్టీ ప్రారంభించిన మెగాస్టార్‌.. అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయారు. మెగాస్టార్‌ సభలకు జనం విపరీతంగా వచ్చినా.. ఓటేసే సమయానికి మాత్రం ఆయన గుర్తులేకుండాపోయారు. దీంతో కేవలం 18 సీట్లతోనే చిరంజీవి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ ఒక్క ఎలక్షన్‌తోనే మెగాస్టార్‌కి సినిమా మొత్తం అర్థమైంది. దీంతో పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్‌లో విలీనం చేసి చేతులు దులుపుకున్నారు. అంతటితో తన రాజకీయ ప్రస్థానాన్ని ముగించారు.

మెగాస్టార్‌ తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ఓ సొంత ఇమేజ్‌ సంపాదించుకున్నారు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌. ఆయన కూడా 2014లో జనసేన పార్టీని స్థాపించి.. అప్పటి ఎన్నికల్లో చంద్రబాబుకు సపోర్ట్‌ చేశారు. తర్వాత 2019 ఎన్నికల్లో బరిలోకి దిగి రెండుచోట్లా ఘోరంగా ఓటమిపాలయ్యారు. జనసేనకు కేవలం ఒక్కటంటే ఒక్కటే సీటు వచ్చింది. ఆ విధంగా రాజకీయాలు వేరు.. అభిమానం వేరు.. అంటూ పవన్‌కు షాకిచ్చారు ఏపీ ప్రజలు.

ఇక తాజాగా ఏపీలో తారక్.. తమిళనాడులో విజయ్… రాజకీయాల్లోకి వస్తారంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. అసలు వాళ్లకు ఆ ఆలోచన ఉందో లేదో తెలీదు కానీ.. ఫ్యాన్స్ మాత్రం వాళ్ల మీద ఒత్తిడి పెంచుతూనే ఉన్నారు. రీల్‌ హీరోల్నే రియల్‌ హీరోలుగా భావిస్తున్న జనం.. ఓటుమీటర్ల దగ్గర మాత్రం తేడాగా స్పందిస్తున్నారు. కొందరు గుణపాఠాలు నేర్చుకుని వెనక్కెళ్లిపోతే.. మరికొందరు హీరోలు మాత్రం దండయాత్రలు చేస్తూనే ఉన్నారు. తమతమ అదృష్టాల్ని పరీక్షించుకుంటూనే ఉన్నారు. దీంతో తారక్, విజయ్‌ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయ్… అసలు వాళ్ల జర్నీ స్ట్రెయిట్ పాలిటిక్స్‌ దాకా వస్తుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ప్రకాశం జిల్లాలో ఈ మధ్య ఎన్టీఆర్‌ సీఎం అంటూ వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ఐతే.. ఈ ఇప్పుడే కాదు.. ఈ ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. జూనియర్ ఎన్టీయార్ పొలిటికల్ అరంగేట్రం అనేది ఎప్పటికప్పుడు తెలుగు రాజకీయాల్ని హీటెక్కించే విషయమే మరి. గతంలో తెలుగుదేశం తరఫున ప్రచారం చేసి.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా.. ప్రజాజీవితానికి బాగా చేరువయ్యారు తారక్. తర్వాత సినిమాలే నాకు ఫస్ట్ ప్రయారిటీ అంటూ సైడిచ్చుకున్నారు. హావభావాలు, ఫేస్ కటింగ్స్, డైలాగ్ డెలివరీ విషయంలో తాతను పోలినట్టుంటే ఎన్టీయార్.. నందమూరి వంశాంకురంగా పేరు తెచ్చుకున్నారు. తారక్ చరిష్మాను, పాపులారిటీని లెక్కలేసుకుని రాజకీయాల్లోకి రావాల్సిందే అంటూ ఒత్తిడి తెస్తూనే ఉన్నారు అభిమానులు.

ఇటు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ది కూడా దాదాపుగా ఇదే పరిస్థితి. ఇళయ దళపతిగా యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న విజయ్.. దాదాపు దశాబ్దకాలంగా పొలిటికల్ వార్తల్లో కనిపిస్తున్నారు. విజయ్ పేరు మీద ఆయన తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌ పార్టీని ప్రకటించారు. అదంతా గతం. కానీ.. ఇటీవలే తన పొలిటికల్ ఆంబిషన్స్‌ని బైటపెట్టుకున్నారు విజయ్. ఫ్రెష్ ఓటర్లే టార్గెట్‌గా స్కెచ్చులేసుకుంటున్నారు. డబ్బు తీసుకుని ఓటేసే ట్రెండ్‌ని మానెయ్యండి.. మన ట్రెండ్ మనం క్రియేట్ చేద్దాం అంటూ ఇటీవల ప్లస్‌టూ స్టూడెంట్స్‌ని ఉద్దేశించి స్టేట్‌మెంట్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మెరికల్లాంటి విద్యార్థుల్ని చేరదీసి.. వాళ్లకు రాజకీయ పాఠాలు నేర్పించాలన్నది విజయ్ ఆలోచన. ఈ మేరకు తన అభిమాన సంఘాల సమాఖ్య విజయ్ మక్కళ్ ఇయక్కమ్‌ని అలర్ట్ చేశారు. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లోనూ సాయంత్రం బడులు ప్రారంభించాలని పిలుపునిచ్చారు. విజయ్ ప్రతిపాదిస్తున్న ఈవెనింగ్ ట్యూషన్స్ మీదే టోటల్ తమిళనాట చర్చ జరుగుతోందిప్పుడు. ఇప్పటినుంచి గ్రౌండ్ వర్క్ చేస్తూ తమిళనాడులో 2026లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాటుదేలాలన్న స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు ఇళయ దళపతి.

ఎంత సీరియస్‌గా వర్కవుట్ చేసినా.. తమకున్న కోట్లాదిమంది అభిమానుల మీద పూర్తిగా నమ్మకం పెట్టుకోలేని పరిస్థితి హీరోలది. ఇక్కడ మెగాస్టార్, అక్కడ సూపర్‌స్టార్.. ఇద్దరూ రాజకీయాలకో దండం పెట్టి వెనుకడుగు వేసినవాళ్లే. కోలీవుడ్‌ సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా పొలిటికల్ డ్రీమ్స్‌ని పూర్తిగా పక్కకుపెట్టేశారు. జయలలిత, కరుణానిధి హయాం నడుస్తున్నప్పుడే రజనీ రాజకీయ ప్రవేశం గురించి జోరుగా వార్తలొచ్చేవి. పార్టీ పెట్టబోతున్నా అని ప్రకటించారు కూడా. మోడీ, అమిత్‌షా తరచూ రజనీని కలుస్తూ.. ఆయన అభిమానుల్లో ఆశలు ఊరేలా చేశారు. కానీ.. అనారోగ్యం బాధపెడుతోంది రాజకీయాలు చేసే ఓపిక లేదు అంటూ షాకిచ్చేశారు. ఆవిధంగా క్లవర్ స్టార్స్ అనిపించుకున్నారు మెగాస్టార్ అండ్ సూపర్‌స్టార్.

తమకున్న పాపులారిటీని ఉపయోగించుకుని సొంత భావజాలంతో పబ్లిక్‌ లైఫ్‌కి దగ్గరయ్యే ప్రయత్నం మరికొందరిది. ఇదే మైండ్‌సెట్‌తో ఇప్పటికీ కుస్తీలు పడుతూనే ఉన్న హీరోలు పవన్‌కల్యాణ్ అండ్ కమల్‌హాసన్. ఓటమిని ఒప్పుకోకుండా పడిలేస్తూనే పోరాటం కొనసాగిస్తున్నారు. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం అంటూ మళ్లీమళ్లీ పరీక్షకు నిలబడుతున్నారు. వీళ్లిస్తున్న స్పూర్తితోనే కోలీవుడ్‌లో విజయ్, టాలీవుడ్‌లో తారక్ ముందడుగు వేస్తారా.. లేక టాప్‌ హీరోలుగా తమకున్న సినిమా లైఫ్‌ని మరి కొన్నేళ్లు కంటిన్యూ చేస్తారా..? అన్నది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =