ఇడుపులపాయలో వైఎస్ఆర్ కి జగన్ నివాళి

YS Jagan Pays Tributes To YSR at Idupulapaya,Mango News,CM Jagan pays tributes to YSR at Idupulapaya,Andhra Pradesh CM Jagan pays tributes to YSR at Idupulapaya,YS Jagan Latest News,#YSRJayanthi

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు , దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి 70 వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. జగన్ కుటుంబ సభ్యులు అందరూ ఇడుపులపాయ కి చేరుకొని అక్కడ ప్రత్యేక పార్ధనలు జరిపారు. అభిమానులు, కార్యకర్తలు ఘాట్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ కార్యక్రమం తరువాత జగన్ ఇడుపులపాయ లో పర్యటించి అక్కడి ఆంజనేయస్వామిని దర్శించుకొని, ఆలయ అభివృద్ధికి నూతనంగా శంకుస్థాపన చేయనున్నారు.

ఈ రోజు జమ్మలమడుగు లో జరిగే సభ లో కొత్తగా పెంచిన పింఛన్ పంపిణీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా ప్రారంభించనున్నారు, అదే సమయం లో వైసీపీ ఎమ్మెల్యే లు,ఎంపీలు, మంత్రులు వారి వారి నియోజకవర్గాల్లో పింఛన్ పంపిణీ కార్యక్రమాలు నిర్వహించి, అర్హులైన ప్రజలకు అందజేయనున్నారు. ఎన్నికల హామీ కింద కొత్తగా పెంచిన రూ. 2250 అర్హులకు అందజేస్తారు ,ఇలా సంవత్సరానికి 250 పెంచుకుంటూ రూ. 3000 అందజేస్తామని ప్రమాణస్వీకార సభలో వైఎస్ జగన్ ప్రకటించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జయంతి అయిన జులై 8 న రైతు దినోత్సవంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, రైతుల గురించి కీలక ప్రకటన చేసే అవకాశమున్నటు అధికారవర్గాల సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here