ఏపీలో నవంబర్ 2 నుంచే స్కూళ్లు ప్రారంభం, రెండ్రోజులకు ఒకసారి తరగతులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పాఠశాలల ప్రారంభంపై సీఎం వైఎస్ జగన్...
ఏపీలో కరోనా: మరో 3503 పాజిటివ్ కేసులు, 28 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 20, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,89,553 కు, మరణాల సంఖ్య 6481 కు చేరుకుంది. గత 24 గంటల్లో...
రాష్ట్రంలో దసరా వరకు అన్ని పరీక్షలు వాయిదా: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంతో పాటుగా అన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దసరా వరకు అన్నిపరీక్షలను వాయిదా వేస్తున్నట్లుగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా...
మాస్క్ లేకుండా బయటకొచ్చి మీ కుటుంబాలను ప్రమాదంలో పడేయవద్దు: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం 6 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలో కరోనా ప్రభావం, ప్రస్తుత పరిస్థితి, కరోనా పరీక్షలు, వ్యాక్సిన్ సహా రాబోయే పండుగ సీజన్ లో...
తుంగభద్ర పుష్కరాలకు సీఎం జగన్ ను ఆహ్వానించిన మంత్రాలయం మఠం ప్రతినిధులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఈ రోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం ప్రతినిధులు కలుసుకున్నారు. నవంబర్ 20 నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు...
తెలంగాణ సీఎం సహాయనిధికి భారీ విరాళాలు అందించిన తెలుగు సినీ ప్రముఖులు
హైదరాబాద్ నగరంలో కురుస్తున్న అతి భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోవడమే కాకుండా భారీ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.550 కోట్లు విడుదల చేసి, నగరంలో వరదనీటి...
ఓటమి ఎప్పుడూ తాత్కాలికమే – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “ఓటమి” అనే అంశం గురించి వివరించారు. ఓటమి ఎప్పుడూ తాత్కలికమేనని, కొంతమంది జీవితాల్లో మాత్రమే అది శాశ్వతమన్నారు. రేపు ఏమి జరుగుతుందో అని...
తెలంగాణ సీఎం సహాయనిధికి రూ. 2 కోట్లు విరాళం ప్రకటించిన సీఎం మమతా బెనర్జీ
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో పెద్దఎత్తున నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలంగాణ రాష్ట్రంలో సహాయ, పునరావాస...
దుబ్బాక ఉపఎన్నిక బరిలో పోటీలో నిలిచిన 23 మంది అభ్యర్థులు వీరే…
మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నవంబర్ 3 న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఉపఎన్నికకు నామినేషన్ పక్రియ ముగిసింది. ముందుగా మొత్తం 46 మంది...
మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని పరామర్శించిన రాష్ట్ర మంత్రులు
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్ తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు....
వరద ప్రభావిత కుటుంబాలకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందించిన మంత్రి కేటిఆర్
హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల వలన ప్రభావితమైన కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలో ఈ రోజు...
సాయంత్రం 6 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు (అక్టోబర్ 20, మంగళవారం) సాయంత్రం 6 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ట్వీట్ చేసి వెల్లడించారు. "ఈ రోజు సాయంత్రం 6...
హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ వర్షం
హైదరాబాద్ నగరంలో మూడు, నాలుగు రోజుల పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరవ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం మరోసారి కుండపోత వర్షం...
త్వరలోనే దేశవ్యాప్తంగా సీఏఏ అమలు చేస్తాం: జేపీ నడ్డా
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్ సభ, రాజ్యసభలో ఆమోదం లభించాక, గత డిసెంబర్ లోనే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఆమోద ముద్ర వేయడంతో చట్టంగా మారిన సంగతి తెలిసిందే....
వర్షాల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం రూ.15 కోట్ల సాయం, కృతజ్ఞతలు తెలిపిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలతో సహా హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో పెద్దఎత్తున నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలంగాణ...
దేశంలో కొత్తగా 46790 కరోనా కేసులు, 587 మరణాలు నమోదు
దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 46,790 పాజిటివ్ కేసులు నమోదవగా, 587 మంది మరణించారు. దీంతో అక్టోబర్ 20,...
నేటి నుంచే 3-4 లక్షల కుటుంబాలకు 10,000 వేలు ఆర్థిక సహాయం: మంత్రి కేటిఆర్
హైదరాబాద్ నగరంలో వరదనీటి ప్రభావానికి గురైన ప్రతీ ఇంటికి రూ.10 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందించనున్నట్టు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్...
తెలంగాణలో కొత్తగా 1486 కరోనా కేసులు, 7 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1486 కరోనా పాజిటివ్ కేసులు, 7 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 1486 కేసులతో కలిపి అక్టోబర్ 19, సోమవారం రాత్రి...
దసరా సమయంలో 3000 ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్న టిఎస్ఆర్టీసీ
తెలంగాణ రాష్ట్రంలో దసరా పండగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపేందుకు టిఎస్ఆర్టీసీ సిద్దమయింది. హైదరాబాద్ నగరం నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 3000 ప్రత్యేక బస్సులు నడపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రంగారెడ్డి ఆర్ఎం...
ఏపీలో తగ్గుతున్న కరోనా ప్రభావం: కొత్తగా 2918 పాజిటివ్ కేసులు, 24 మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం తగ్గుముఖం పట్టింది. అక్టోబర్ 19, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,86,050 కు చేరుకుంది. గత 24...






















































