లండన్​లో భారత జాతీయ పతాకానికి అగౌరవం.. కేంద్రం సీరియస్, బ్రిటన్‌ దౌత్యవేత్తకు సమన్లు

India Summons Top UK Diplomat After Khalistan Supporters Take Down National Flag at Indian High Commission in London,India Summons Top UK Diplomat,Khalistan Supporters Take Down National Flag,Supporters Take Down Flag at Indian High Commission in London,Mango News,Mango News Telugu,Unacceptable: India pulls up UK diplomat,UKs Indifference Unacceptable,Khalistan Supporters Pull Down Indian Flag,Strong Protest From MEA After Pro-Khalistan,Indian flag pulled down by Khalistani,Indian Prime Minister Narendra Modi,National Political News,Indian Political News

లండన్​లో భారత త్రివర్ణ పతాకానికి అగౌరవం జరిగింది. ఖలిస్థాన్‌ అనుకూలవాదులు కొందరు లండన్‌లోని భారత్‌ హైకమిషన్‌ భవనం పైన ఉండే భారత జాతీయ జెండాను కిందికి దింపివేసి అగౌరవ పరిచారు. ఇక ఈ ఘటనపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. దీనిపై సవివరణ ఇవ్వాలంటూ ఢిల్లీలోని బ్రిటన్‌ సీనియర్‌ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. లండన్‌లో ఖలిస్థాన్ వేర్పాటువాదులు చేసిన పనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, దీనికి బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈ చర్యను తీవ్రమైనదిగా పరిగణించిన భారత విదేశాంగ శాఖ అక్కడకు నిరసనకారులు వచ్చేంతవరకూ భారత హైకమిషన్‌ భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది.

కాగా ఖలిస్థానీ సానుభూతిపరుడు, ‘వారిస్‌ పంజాబ్‌ దే’ నేత అమృత్‌పాల్‌ సింగ్‌ అనుచరులను పంజాబ్‌ పోలీసులు అరెస్టు చేస్తున్న క్రమంలో గత రెండు రోజులుగా పంజాబ్‌లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు అమృత్‌పాల్‌ సింగ్‌ జాడ కోసం పంజాబ్‌ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అలాగే అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారనే అభియోగంపై కూడా అమృత్‌పాల్‌పై మరో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రవాస సిక్కుల్లోని అమృత్‌పాల్‌ సింగ్‌ మద్దతుదారులు లండన్‌లో నిరసనలు చేపట్టారు. దీనిలో భాగంగా లండన్‌లోని భారత హై కమిషన్‌ భవనంపై ఏర్పాటు చేసిన జాతీయ జెండాను కిందికి దించివేశారు. ఖలిస్థానీ మద్దతుదారులు పెద్దఎత్తున భారత హై కమిషన్‌ భవనం వద్ద గుమికూడటం, త్రివర్ణ పతాకాన్ని కిందికి దించివేయడం తదితర దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 6 =