బిగ్ బాష్ లీగ్‌ లో సంచలనం, సిడ్నీ థండర్‌ జట్టు కేవలం 15 పరుగులకే ఆలౌట్‌

BBL Sydney Thunder All Out for 15 Runs Against Adelaide Strikers Sets Record Low Score in T20,BBL,Sydney Thunder,Adelaide Strikers,Mango News,Mango News Telugu,Bbl Live Match Today,Big Bash League Today Match,Bbl Live Score Cricbuzz,Big Bash League 2022-23 Squad,Bbl Live Score 2022,Bbl 2022 Schedule Cricbuzz,Big Bash League Live Score,Big Bash League 2023,Women'S Bbl Matches,Marvel Stadium Bbl Matches,Mcg Bbl Matches,Cricket Bbl Matches,Bbl Upcoming Matches,Bbl 2022 Matches,Bbl 11 Matches,Bbl Upcoming Matches 2022,Bbl Srl Matches,Bbl 10 Matches,Bbl Live Match

ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్‌ లో శుక్రవారం సంచలనం నమోదైంది. బీబీఎల్ లో భాగంగా సిడ్నీ థండర్, అడిలైడ్ స్ట్రైకర్స్‌ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో సిడ్నీ థండర్ కేవలం 15 పరుగులకే ఆలౌట్ అయింది. సిడ్నీ థండర్ పేలవమైన ప్రదర్శనతో ప్రొఫెషనల్ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోరును నమోదు చేసింది. గతంలో ఈ రికార్డ్ టర్కీ జట్టుపై ఉంది. ఆగస్టు 2019లో చెక్ రిపబ్లిక్‌ పై టర్కీ 21 పరుగుల అత్యల్ప స్కోరు నెలకొల్పగా, తాజాగా సిడ్నీ థండర్‌ జ‌ట్టు కేవ‌లం 15 ప‌రుగులే చేయడంతో ఇబ్బందికరమైన ఆ రికార్డ్ సొంతం చేసుకోవాల్సి వచ్చింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్‌ 9 వికెట్లకు 139 పరుగులు చేయగా, 140 ప‌రుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ థండ‌ర్ జ‌ట్టు వెంటవెంటనే వికెట్ల‌ను కోల్పోయి 15 పరుగులే చేయగా, 124 పరుగులతో అడిలైడ్ స్ట్రైకర్స్‌ ఘన విజయం సాధించింది. అడిలైడ్ స్ట్రైకర్స్‌ బౌలర్ హెన్రీ థార్న్‌టన్‌ 5 వికెట్లు, వెస్‌ అగార్‌ 4 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేయడంతో సిడ్నీ థండర్‌ ఖాతాలో చెత్త రికార్డు నమోదైంది. అలెక్స్‌ హేల్స్‌, రిలీ రొసో వంటి స్టార్ ప్లేయర్స్ కూడా సిడ్నీ థండర్‌ ను ఆదుకోలేక పోయారు. నెంబర్ 10 లో బ్యాటింగ్ చేసిన బ్రెండన్ డోగెట్ నాలుగు పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. అలాగే ఈ మ్యాచ్ తో టీ20ల్లో కేవలం 5.5 ఓవర్లలోనే ఇన్నింగ్స్‌ ను ముగించిన జట్టుగా కూడా సిడ్నీ థండర్‌ నిలిచింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =