శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగే హోమ్ సిరీస్‌ల షెడ్యూల్‌ ప్రకటించిన బీసీసీఐ

BCCI Announces schedule for Home Series Against Sri Lanka New Zealand and Australia,BCCI schedule of home series, BCCI schedule against Sri Lanka,BCCI schedule New Zealand,BCCI schedule Australia,Mango News,Mango News Telugu,3 Member Cricket Advisory Committee,BCCI Advisory Committee,Advisory Committee BCCI,BCCI,BCCI Latest News and Updates,BCCI Latest News and Live Updates,The Board of Control for Cricket in India,India’s Tour of Bangladesh,India Vs Sri Lanka,India Vs New Zealand,India Vs Australia,Sri Lanka,New Zealand,Australia,BCCI Schedule Latest News, BCCI Schedule News Updates

శ్రీలంక, న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియాతో జరిగే హోమ్ సిరీస్‌ల షెడ్యూల్‌ను భారత్ క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) గురువారం ప్రకటించింది. భారత్ యొక్క 2022-23 అంతర్జాతీయ హోమ్ సీజన్ జనవరిలో శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ లతో ప్రారంభమవుతుందని తెలిపారు. అనంతరం భారత్ జట్టు న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడనుందని, ఆ మ్యాచ్ లకు హైదరాబాద్, రాయ్‌పూర్ మరియు ఇండోర్‌లు ఆతిథ్యం ఇస్తాయని చెప్పారు. జనవరి 21న న్యూజిలాండ్ తో జరిగే రెండో వన్డే రాయ్‌పూర్ నగరంలో జరుగుతుందని, రాయ్‌పూర్ మొదటిసారిగా అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుందని తెలిపారు. అలాగే న్యూజిలాండ్‌ తో భారత్ జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా ఆడనుంది.

ఇక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం దేశంలో ఆస్ట్రేలియా జట్టు పర్యటన ఫిబ్రవరి 9 నుండి నాగ్‌పూర్‌లో తోలి టెస్టుతో ప్రారంభం కానుంది. ఆ తర్వాత భారత్-ఆస్ట్రేలియా మధ్య ఢిల్లీ, ధర్మశాల, అహ్మదాబాద్‌ లలో తదుపరి మూడు టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. 4 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఫీచర్ అయిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఇదే చివరి ఎడిషన్ అని తెలిపారు. అనంతరం ఆస్ట్రేలియాతో ముంబయి, వైజాగ్ మరియు చెన్నైలలో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో స్వదేశంలో సిరీస్ ముగుస్తుందని బీసీసీఐ వెల్లడించింది.

శ్రీలంకతో భారత్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్:

  • మొదటి టీ20 – జనవరి 3 – ముంబయి
  • రెండో టీ20 – జనవరి 5 – పూణే
  • మూడో టీ20 – జనవరి 7 – రాజ్ కోట్

శ్రీలంకతో భారత్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్:

  • మొదటి వన్డే – జనవరి 10 – గౌహతి
  • రెండో వన్డే – జనవరి 12 – కోల్ కతా
  • మూడో వన్డే – జనవరి 15 – త్రివేండ్రం

న్యూజిలాండ్ భారత్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్:

  • మొదటి వన్డే – జనవరి 18 – హైదరాబాద్
  • రెండో వన్డే – జనవరి 21 – రాయ్‌పూర్
  • మూడో వన్డే – జనవరి 24 – ఇండోర్

న్యూజిలాండ్ తో భారత్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్:

  • మొదటి టీ20 – జనవరి 27 – రాంచి
  • రెండో టీ20 – జనవరి 29 – లక్నో
  • మూడో టీ20 – ఫిబ్రవరి 1 – అహ్మదాబాద్

ఆస్ట్రేలియాతో భారత్ 4 టెస్టుల సిరీస్‌:

  • మొదటి టెస్టు – ఫిబ్రవరి 9-13 – నాగపూర్
  • రెండో టెస్టు – ఫిబ్రవరి 17-21 – ఢిల్లీ
  • మూడో టెస్టు – మార్చ్1-5 – ధర్మశాల
  • నాలుగో టెస్టు – మార్చ్ 9-13 – అహ్మదాబాద్

ఆస్ట్రేలియాతో భారత్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్:

  • మొదటి వన్డే – మార్చ్ 17 – ముంబయి
  • రెండో వన్డే – మార్చ్ 19 – వైజాగ్
  • మూడో వన్డే – మార్చ్ 22 – చెన్నై.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − twelve =