ఆ నగరానికి వెళ్తే 14 రోజుల హోమ్ ఐసోలేషన్ తప్పనిసరి

BMC Says 14 Days Home Isolation Compulsory for Domestic passengers who arriving to Mumbai

మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ముంబయి నగరంలో పెద్దసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 7, శుక్రవారం నాడు బృహాన్‌ ముంబయి కార్పొరేషన్‌ (బీఎంసీ) కీలక ప్రకటన విడుదల చేసింది. ముంబయి నగరానికి దేశీయ ప్రయాణికులు ఎవరూ వచ్చిన సరే 14 రోజులపాటు తప్పనిసరిగా హోం ఐసోలేషన్‌లో ఉండాలని ప్రకటించింది.

దేశంలో ఎక్కడి నుంచి వచ్చిన ఈ నిబంధన అమలు చేయబడుతుందని చెప్పారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా ఈ నిబంధన నుంచి మినహాయింపు పొందాలనుకుంటే వచ్చే ముందు రెండు రోజుల ముందుగానే [email protected] మెయిల్ చేసి సమాచారం ఇవ్వాలని బీఎంసీ పేర్కొంది. మరోవైపు ఆగస్టు 6 నాటికీ మహారాష్ట్రలో 479779 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 316375 మంది కోలుకోగా, 16792 మంది మరణించారు. ప్రస్తుతం 146305 మంది చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =