కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. సెజ్‌లలో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ పై కొత్త మార్గదర్శకాలు జారీ

Central Govt Announces New Rules For Work From Home in Special Economic Zones, Govt Announces New Rules For Work From Home in Special Economic Zones, New Rules For Work From Home in Special Economic Zones, Special Economic Zones, New Rules For Work From Home, Work From Home in Special Economic Zones, Work From Home New Rules, Work From Home, Central Govt, New Work From Home Rules Announced, Work From Home is allowed for a maximum period of one year in a special economic zone unit, Work From Home can be extended to 50 per cent of total employees, Special Economic Zones Rules, Work From Home New Rules News, Work From Home New Rules Latest News, Work From Home New Rules Latest Updates, Work From Home New Rules Live Updates, Mango News, Mango News Telugu,

స్పెషల్ ఎకనామిక్ జోన్ల (సెజ్‌ల)లో పని చేసేవారికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సెజ్‌లలో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ విధానంపై కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ మంగళవారం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. స్పెషల్ ఎకనామిక్ జోన్ రూల్స్, 2006 ప్రకారం ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ కొత్త రూల్ 43Aని వాణిజ్య శాఖ నోటిఫై చేసింది. దీని ప్రకారం స్పెషల్ ఎకనామిక్ జోన్ యూనిట్‌లలో వర్క్ ఫ్రమ్ హోమ్గరిష్టంగా ఒక సంవత్సరం పాటు అనుమతించబడుతుంది. ఇంకా మొత్తం ఉద్యోగులలో 50 శాతం వరకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ విధానంలో పని చేయవచ్చు.

అలాగే ఏడాది కాలం పూర్తయిన ఉద్యోగులకు అదనంగా మరో ఏడాది పాటు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ను కొనసాగించే వెసులుబాటును కల్పించింది. ఒకవేళ 50 శాతానికి మించి ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించాలంటే మాత్రం సంబంధిత కారణాల్ని సెజ్‌ల డెవలప్‌మెంట్ కమిషనర్ కు రాతపూర్వకంగా తెలిపి, అనుమతి తీసుకోవాలని వాణిజ్య శాఖ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా అన్ని సెజ్‌లలో ఒకేరకమైన పని విధానం కోసం పరిశ్రమల నుండి వచ్చిన డిమాండ్ మేరకు తాజా నోటిఫికేషన్ జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, ఐటీ, సెజ్‌ రంగాల్లోని కొన్ని కేటగిరిల ఉద్యోగులతో పాటు కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహించలేని ఉద్యోగులకు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లి పనిచేసే వారికి దీనిద్వారా ఉపశమనం కలగనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =