సమతామూర్తి విగ్రహ స్థాపనకు సర్వం సిద్ధం: చిన్నజీయర్ స్వామి

వెయ్యి సంవత్సరాల క్రితమే సమాజంలోని అసమానతలను తొలగించడానికి కృషి చేసిన మహనీయుడు శ్రీ రామానుజాచార్యులు అని చిన్న జీయర్ స్వామి చెప్పారు. అందుకే, ఆయన జన్మించి 1,000 సంవత్సరాలు పూర్తవుతున్న శుభ సందర్భంలో హైదరాబాద్ లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం గురించి వివరాలు తెలిపేందుకు చిన్న జీయర్ స్వామి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. స్వామి పలు విశేషాలను పంచుకున్నారు.

9 అనేది విశిష్ట అంకె అని.. అందుకే ఈ ప్రాజెక్టులో అన్నీ 9 అంకె కలిసి వచ్చేలా నిర్మాణం చేసినట్లు స్వామి చెప్పారు. 216 అడుగులతో శ్రీ రామానుజాచార్యుల వారి విగ్రహాన్ని నిర్మించినట్లు స్వామి తెలిపారు. విగ్రహానికి ఉన్న మెట్లు కూడా 108 ఉంటాయి. వారి చేతిలో ఉన్న దండం 162 అడుగులు అని, అలాగే విగ్రహం వేదిక వెడల్పు 54 అడుగులు అని, ఎత్తు కూడా 54 అడుగులు అని స్వామి చెప్పారు. కాగా, ఈ విగ్రహానికి ‘సమతామూర్తి’ అని నామకరణం చేసినట్లు చిన్న జీయర్ స్వామి చెప్పారు. భారతదేశం లోని 108 ప్రముఖ దివ్య క్షేత్రాలలో ఉన్న శక్తిని ఇక్కడి విగ్రహం వద్ద ప్రతిష్టిస్తున్నట్లు స్వామి తెలియజేశారు.

ప్రపంచ సర్వమానవాళి శ్రేయస్సు కొరకు ఈ సమతామూర్తి విగ్రహ స్థాపనకు పూనుకున్నట్లు చిన్న జీయర్ స్వామి చెప్పారు. శ్రీ రామానుజాచార్యుల వారి జీవితం మనందరికీ ఆదర్శప్రాయం అని స్వామి అన్నారు. ఈ సందర్భంగా.. 1035 హోమకుండాలను ఏర్పాటుచేసి పవిత్ర ‘లక్ష్మీ నారాయణ’ యాగం  చేయబోతున్నట్లు చిన్న జీయర్ స్వామి చెప్పారు. వేదం విఙ్ఞానానికి మూలం అని.. అందుకే ఇక్కడ వేదం శక్తిని ఇక్కడ అనుసంధానం చేయబోతున్నాం అని స్వామి చెప్పారు. ఈ పవిత్ర కార్యక్రమానికి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మరియు ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నట్లు చిన్న జీయర్ స్వామి తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 3 =