పంజాబ్‌ లో కీలక పరిణామం, పీసీసీ పగ్గాలు దక్కించుకున్న నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ

Congress a Mango News, Navjot Singh Sidhu, Navjot Singh Sidhu Appointed As New PCC President, Navjot Singh Sidhu Appointed As New PCC President Amid Ongoing Issues Within Punjab Congress Unit, Navjot Singh Sidhu as the President of the Punjab Congress Committee, New PCC President Amid Ongoing Issues Within Punjab Congress Unit, Punjab Congress, Punjab Congress Navjot Singh Sidhu, Punjab Congress Unit, Punjab Politics, Punjab Pradesh Congress Committee, Sonia GandhiPresident Sonia Gandhi Appointed Navjot Singh Sidhu as Punjab PCC President

పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ నియమించబడ్డారు. ఈ మేరకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నట్టు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ ఆదివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే పంజాబ్‌ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ గా సంగత్‌ సింగ్‌ గిల్జియాన్, సుఖ్వీందర్‌ సింగ్‌ డానీ, పవన్‌ గోయెల్, కుల్జీత్‌ సింగ్‌ నాగ్రాలను నియమించారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఇక ఇప్పటివరకు పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన సునీల్ జాఖర్ సేవలను కాంగ్రెస్ పార్టీ కొనియాడింది.

గత కొన్ని రోజులుగా పంజాబ్ సీఎం అమరీందర్‌ సింగ్‌, నవజోత్‌ సింగ్‌ సిద్దూల మధ్య నెలకున్న విభేదాల నేపథ్యంలో పంజాబ్ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ముందుగా పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవిని సిద్ధూకు అప్పజెప్పనున్నట్టు వచ్చిన ఊహాగానాలపై సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు. అయినప్పటికీ పంజాబ్ లో పార్టీ పగ్గాలు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూకే అప్పగిస్తూ సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − four =