ఇండియా కూటమితో నితీశ్ తెగతెంపులు

Nitish Kumar, BJP, Nitish Kumar Alliance with BJP, Alliance with BJP?, Karpoori Thakur, Bihar, Breaks with India alliance,RJD, Congress, Lalu Prasad Yadav's RJD, Bihar, INDIA bloc, Amit Shah, Mango News Telugu, Mango News,
Nitish Kumar, Karpoori Thakur, Bihar,Nitish Kumar alliance with BJP? , Breaks with India alliance,RJD, Congress

బీహార్‌లో అధికార కూటమి జేడీయూ, ఆర్జేడీల బంధం బీటలు వారేలా కనిపిస్తోందన్న వార్తలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. బీజేపీ మద్దతుతో  కొత్త ప్రభుత్వం రానుందని తెలుస్తోంది. బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్‌ కుమార్‌  కొనసాగుతారని, బీజేపీ నుంచి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని  మీడియా  కథనాలు వెల్లడవుతున్నాయి.

ఆదివారం అంటే జనవరి 28న  నితీశ్‌ కుమార్ బీహార్‌ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. దీనివల్లే ఇప్పటికే షెడ్యూల్లో ఉన్న జనవరి 28న తన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ ప్రకారం..మహారాణా జయంతి సందర్భంగా నితీష్ కుమార్ ఒక బహిరంగ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. కానీ అది ఇప్పుడు  జరుగుతుందో, లేదో అన్న సందిగ్ధత నెలకొంది.   నితీశ్ ఇండియా కూటమిలో  భాగస్వాములైన ఆర్జేడీ, కాంగ్రెస్‌ విషయంలో అసంతృప్తిగా ఉన్నారట.

బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకుర్‌‌కు భారతరత్న ప్రకటించిన దగ్గరి నుంచే.. జేడీయూ, ఆర్జేడీల మధ్య ఉన్న చీలికలు ఒక్కసారిగా బయటపడినట్లు తెలుస్తోంది. ఠాకుర్ జయంతి వేడుకలను రెండు పార్టీలు విడివిడిగా నిర్వహించడం వెనుక అదే కారణం ఉందని అంటున్నారు. ఆ సందర్భంలో నితీశ్‌ కుమార్ చేసిన వారసత్వ రాజకీయాల వ్యాఖ్యలకు కౌంటర్‌గా.. లాలూప్రసాద్‌ యాదవ్ కుమార్తె సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి కాసేపటి తర్వాత వాటిని తొలగించారు.దీనికి తోడు లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నా కూడా ఇంకా.. సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపైన కూడా నితీశ్‌ కుమార్ అసంతృప్తికి గురయినట్లు తెలుస్తోంది.

కొన్నేళ్లుగా నితీశ్‌ జంపింగ్‌లపై రాజకీయంగా చర్చలు జోరందుకుంటున్నాయి. ఇప్పటికే చాలాసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నితీష్ కుమార్.. తరచూ పదవుల కోసం పార్టీ విధానాలను కూడా పక్కనపెట్టి వ్యవహరిస్తుండటంపై సొంత వర్గం నుంచీ కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ ప్రభావమే ఎన్నికల ఫలితాలపైన పడినట్లే అయింది. అయితే  ఇండియా కూటమిలో కీలక వ్యక్తి అయిన నితీశ్‌ కుమార్ బీజేపీతో  పొత్తు పెట్టుకుంటే  కూటమికి పెద్ద దెబ్బే అని చెప్పాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =