సాగు చట్టాల తాత్కాలిక నిలుపుదలకు రైతుల తిరస్కరణ, 11వ రౌండ్ చర్చలు ప్రారంభం

11th Round of Talks Begins between Farmers and Union Ministers, Another Round Of Talks Over Farm Bills, Central Government And Farmers Union Meet, Central Government Over Farm Bills, Farm Bills, Farmers Protest, Farmers Protest Against Farm Bills, Farmers Protest Against Farm Laws, Farmers Protest Highlights, Farmers Protest Latest News, Farmers Protest Latest Updates, Farmers Protest Update, Farmers Protesting, Farmers Protests Continue, Farmers Union, Indian Farmers Protest, Mango News, tractor rally, Union Home Minister

నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళన కొనసాగుతుంది. చట్టాలకు సంబంధించి కేంద్రప్రభుత్వం, రైతు సంఘాల మధ్య ఇప్పటికే 10 రౌండ్ల చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. బుధవారం నాడు 10వ రౌండ్ చర్చల సందర్భంగా వ్యవసాయ చట్టాలను 18 నెలలపాటుగా తాత్కాలికంగా నిలుపుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం రైతుల ముందు ప్రతిపాదన పెట్టింది. అయితే గురువారం నాడు రైతు సంఘాల సమన్వయ కమిటీ కీలక సమావేశాన్ని నిర్వహించి కేంద్రం ప్రతిపాదనను తిరస్కరిస్తునట్టు ప్రకటించారు.

మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం, కనీస మద్దతు ధరపై చట్టబద్ధత కల్పించడమే తమ ప్రాధాన్యత అంశాలని రైతు సంఘాల నాయకులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు న్యూఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో 11వ రౌండ్ చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశానికి వివిధ రైతు సంఘాల నేత‌లు, కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పియూష్ గోయల్ హాజరయ్యారు. మరోవైపు జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో ట్రాక్టర్లతో ‘కిసాన్ గణతంత్ర పరేడ్’ నిర్వహించేందుకు రైతు సంఘాలు సిద్ధమవుతున్నాయి.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − ten =