ఢిల్లీలో రైతుల నిరసన: ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రత భారీగా పెంపు

Delhi Tractor Rally Violence, Farmer Republic Day Tractor Rally, Farmers Protest, Farmers Protest Against Farm Bills, Farmers Protest Against Farm Laws, Farmers Protest Highlights, Farmers Protest In Delhi, Farmers Protest Latest News, Farmers Protest Latest Updates, Farmers Protesting, Farmers Protesting Against Farm Laws, Farmers Tractor Rally at Delhi, Farmers Tractor Rally On Republic Day, Indian Farmers Protest, Security Increased at Singhu border, tractor rally

కేంద్రం తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ చట్టాల‌కు వ్య‌తిరేకంగా జనవరి 26, గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం పరేడ్ అనంతరం రైతులంతా ఢిల్లీ సరిహద్దులలో వారు నిరసన వ్యక్తం చేస్తున్న ప్రాంతాలకు చేరుకున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో సింగు సరిహద్దు వద్ద పోలీస్ బలగాలతో భద్రతను మరింతగా పెంచారు. అలాగే నిన్న చోటు చేసుకున్న సంఘటనల దృష్ట్యా ఎర్రకోట వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రైతుల టాక్టర్ల ర్యాలీ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై ఉన్నతాధికారులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సమీక్ష చేపట్టారు. పరిస్థితిని పూర్తిగా అదుపులో ఉంచేందుకు అదనపు బలగాలను మోహరించాలని నిర్ణయించారు. నిన్న జరిగిన హింసకు సంబంధించి ఢిల్లీ పరిధిలో మొత్తం 15 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసినట్టు తెలుస్తుంది.

ముందుగా మంగళవారం నాడు సింఘు, టిక్రీ సరిహ‌ద్దుల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాలలోని బారికేడ్లను దాటుకుని వెళ్లేందుకు రైతులు ప్రయత్నం చేస్తుండడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పలు చోట్ల పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పోలీసులకు, రైతులకు మధ్య ఘర్షణ వాతావరణం కూడా నెలకుంది. పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించి రైతులను నియంత్రించేందుకు ప్రయత్నించారు. మరోవైపు కొందరు రైతులు ట్రాక్టర్లతో ఎర్రకోట వద్దకు చేరుకుని, భద్రత వలయాలనుంచి తప్పించుకుని ఎర్రకోట పైకి వెళ్లారు. ఎర్రకోట వద్ద నిశాన్ సాహిబ్ జెండాలను ఎగరవేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా విమర్శలకు దారితీసింది.

అయితే కొన్ని సంఘ విద్రోహ శక్తులు తమ ర్యాలీలోకి ప్రవేశించాయని, ర్యాలీ సందర్భంగా జరిగిన అవాంఛనీయ, హింసాత్మక ఘటనల్ని ఖండిస్తున్నట్టు రైతు సంఘాలు పేర్కొన్నాయి. ఇక ఢిల్లీలోని సింఘు, ఘాజీపూర్‌, ముఖుర్దాచౌక్‌, టిక్రీ, నగ్లోయ్‌ ప్రాంతాల్లో మంగళవారం రాత్రి 12 గంటల వరకు ఇంటర్నెట్‌ సేవలను కూడా కేంద్రం నిలిపివేసింది. మరోవైపు ఈ ర్యాలీలో బారికేడ్లను దాటుకుని వెళ్లేందుకు ప్రయత్నించిన ఘాజీపూర్ కు చెందిన ఓ రైతు ట్రాక్టర్‌ బోల్తాపడడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అలాగే ట్రాక్టర్ల పరేడ్ లో విధులు నిర్వహించిన వారిలో 109 మంది పోలీసులు గాయపడ్డట్లు అధికారులు వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 4 =