కోవిడ్-19 నేపథ్యంలో ఆన్‌లైన్ మోసాలపై గూగుల్ సూచనలు

Coronavirus, coronavirus scam news, covid 19 fake news, COVID-19, COVID-19 online scams, COVID-19 Related Online Scams, Google, Google India, Google India Aims to Help You, Google launches website to help users, Google new website

ఇటీవల కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో ఆన్‌లైన్ మోసాలలో గణనీయమైన పెరుగుదలను గుర్తించినట్టుగా గూగుల్ ఇండియా ప్రకటించింది. ఈ మోసాలను గుర్తించడం మరియు నివారించడంలో సహాయపడటానికి గూగుల్ పలు సూచనలను అందిస్తుంది. వీటిని పాటించి ఆన్‌లైన్ మోసాలను కనిపెట్టి ఎదుర్కోవచ్చు.

సాధారణ కోవిడ్-19 ఆన్‌లైన్ మోసాలు:

మీ వ్యక్తిగత డేటాను దొంగిలించడం:

  • మీ చిరునామా, బ్యాంక్ ఖాతా నెంబర్ లేదా పిన్ నంబర్ వంటి వివరాలను చెప్పమని ఫోన్స్ కాల్స్ వస్తుంటాయి. ఆ వివరాలను ఎవరికీ ఇవ్వకూడదు.

వస్తువులు మరియు సేవలపై నకిలీ ఆఫర్లు:

  • ఈ సమయంలో ఎలాంటి అధికారిత, రిజిస్ట్రేషన్ లేని థర్డ్ పార్టీ సంస్థల నుండి వస్తువులు, ఆన్‌లైన్ వినోద సేవల సభ్యత్వాలు వంటి వాటిపై భారీ తగ్గింపని మెసెజ్ లు, కాల్స్ వస్తుంటాయి. వీటికి స్పందించకూడదు.

అధికారుల లాగా వ్యవహరించడం:

  • కోవిడ్-19 సమాచారాన్ని అందించే ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వంటి ప్రభుత్వ సంస్థల లాగా నటించి తప్పుడు సమాచారాన్ని ఇస్తే తీసుకోకూడదు.

మోసపూరిత వైద్య ఆఫర్లు:

  • ఈ సమయంలో కరోనా తగ్గిస్తాం, టెస్టింగ్ కిట్లు, హ్యాండ్ శానిటైజర్ లేదా ఫేస్ మాస్క్‌లపై వ్యాపారం చేస్తూ, మోసపూరిత ఆఫర్లు ప్రకటించే వారిని నమ్మకూడదు.

స్వచ్ఛంద విరాళాల కోసం నకిలీ అభ్యర్థనలు:

  • కోవిడ్-19 పై పోరాటంలో భాగంగా విరాళాలను ఇచ్చే ముందు ఆ సంస్థలు, లేదా వ్యక్తుల పట్ల ముందుగానే తనిఖీ చేసుకొని, అన్ని విషయాలు తెలుసుకుని ఇవ్వాలి.

కరోనా వైరస్ గురించి సమాచారం ఇస్తున్న ముసుగులో మెసెజ్, ఇ-మెయిల్‌, ఆటోమేటెడ్ కాల్స్ మరియు హానికరమైన వెబ్‌సైట్‌ల ద్వారా ఈ ఆన్‌లైన్ మోసగాళ్లు పలు విధాలుగా సంప్రదిస్తున్నారు. జాగురకతతో వ్యవహరించి ఈ మోసాలు బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + nineteen =