ఇండియా: లడఖ్ లోని ష్యోక్ న‌దిలో ప‌డిపోయిన ఆర్మీ వాహనం.. ఏడుగురు జ‌వాన్లు దుర్మరణం

India 7 Army Soldiers Demise in Ladakh Road Mishap Grievous Injuries To Others, India 7 Army Soldiers Demise in Ladakh Road Mishap, Grievous Injuries To Others, India 7 Army Soldiers Demise, 7 Army Soldiers Demise, Ladakh Road Mishap, A devastating accident in the Turtuk sector claimed the lives of seven soldiers and left 19 others grievously injured, 19 others grievously injured, A devastating accident in the Turtuk sector, Seven Army personnel killed, Ladakh Road Mishap News, Ladakh Road Mishap Latest News, Ladakh Road Mishap Latest Updates, Ladakh Road Mishap Live Updates, Mango News, Mango News Telugu,

భారత్ బోర్డర్ వద్ద శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లడఖ్‌ లోని తుర్టుక్ సెక్టార్‌లో జరిగిన వాహనం ప్రమాదంలో ఏడుగురు భారత ఆర్మీ సైనికులు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం వారిని తీసుకువెళుతున్న వాహనం రోడ్డుపై నుంచి ష్యోక్ నదిలో జారిపడి పోయిందని ఆర్మీ అధికారులు ప్రకటించారు. లేహ్ జిల్లాలోని నుబ్రా ప్రాంతంలోని థోయిస్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశంలో ఉదయం 9 గంటల ప్రాంతంలో తుక్తుక్ సెక్టార్‌లో ప్రమాదం జరిగిందని వారు తెలిపారు. 26 మంది సైనికుల బృందం పార్తాపూర్ ట్రాన్సిట్ క్యాంప్ నుండి సబ్ సెక్టార్ హనీఫ్‌లోని ఫార్వర్డ్ ప్రదేశానికి వాహనంలో వెళుతున్నట్లు అధికారులు తెలియజేశారు.

ఈ క్రమంలో వాహనం అదుపు తప్పి నదిలో పడి 50-60 అడుగుల లోతులో పడిందని వెల్లడించారు. దీంతో వారందరికీ గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ వేగంగా నిర్వహించబడిందని, సైనికులందరినీ పార్తాపూర్‌లోని ఫీల్డ్ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఏడుగురిని మృతి చెందారని, మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. గాయపడిన వారికి ఉత్తమ వైద్య సంరక్షణ అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, అత్యవసర వైద్య సహాయం కావాల్సిన వారికి వెస్ట్రన్ కమాండ్‌కు తరలించడానికి వైమానిక దళం నుండి సూచనలు అందాయని అధికారులు చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =